Share News

Indus Infra Trust: 4 రోడ్‌ ప్రాజెక్టులకు కేఎన్‌ఆర్‌ గుడ్‌బై

ABN , Publish Date - Dec 26 , 2025 | 04:51 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌.. కేరళ, తమిళనాడుల్లోని నాలుగు రహదారి ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది. కేఎన్‌ఆర్‌ పళని ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌...

 Indus Infra Trust: 4 రోడ్‌ ప్రాజెక్టులకు కేఎన్‌ఆర్‌ గుడ్‌బై

కొనుగోలు చేసిన ఇండస్‌ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌.. కేరళ, తమిళనాడుల్లోని నాలుగు రహదారి ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది. కేఎన్‌ఆర్‌ పళని ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌, కేఎన్‌ఆర్‌ రామగిరి ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌, కేఎన్‌ఆర్‌ గురువాయుర్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌, కేఎన్‌ఆర్‌ రామనట్టుకర ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే ఈ నాలుగు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) సంస్థలను ఇండస్‌ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌కు రూ.1,543.19 కోట్లకు విక్రయించినట్టు తెలిపింది. దీనికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు కేఎన్‌ఆర్‌ తెలిపింది. ఈ నాలుగు ఎస్‌పీవీలకు ఉన్న రుణాలు కూడా ఇండస్‌ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌కు బదిలీ అవుతాయి. వచ్చే ఏడాది సెప్టెంబరు నెలాఖరుకల్లా ఈ ఒప్పందం పూర్తవుతుందని కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?

బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..

Updated Date - Dec 26 , 2025 | 04:51 AM