Share News

KIMS Increases Stake: సన్‌షైన్‌ హాస్పిటల్‌లో కిమ్స్‌కు మరింత వాటా

ABN , Publish Date - Dec 20 , 2025 | 04:03 AM

కృష్ణా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌).. సన్‌షైన్‌ హాస్పిటల్‌ ఈక్విటీలో మరో 6.94ు వాటా కొనుగోలు చేసింది. దీంతో సన్‌షైన్‌ హాస్పిటల్‌ ఈక్విలో..

KIMS Increases Stake: సన్‌షైన్‌ హాస్పిటల్‌లో కిమ్స్‌కు మరింత వాటా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కృష్ణా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌).. సన్‌షైన్‌ హాస్పిటల్‌ ఈక్విటీలో మరో 6.94% వాటా కొనుగోలు చేసింది. దీంతో సన్‌షైన్‌ హాస్పిటల్‌ ఈక్విలో కిమ్స్‌ వాటా 68.59% నుంచి 75.53 శాతానికి చేరింది. స్వతంత్ర వాల్యూయర్‌ నివేదిక ప్రకారం రూ.148.09 కోట్లతో ఈ 6.94% వాటా కొనుగోలు చేసినట్టు కిమ్స్‌ వెల్లడించింది. వివిధ దశలుగా జరిగిన ఈ వాటాల కొనుగోలు శుక్రవారంతో ముగిసిందని పేర్కొంది. సన్‌షైన్‌ హాస్పిటల్‌ తమ అనుబంధ సంస్థ అయినందున ఈ వాటా కొనుగోలుకు ఏ రెగ్యులేటరీ సంస్థల నుంచి ముందస్తు అనుమతులు అవసరం లేదని పేర్కొంది. హెల్త్‌కేర్‌ రంగంలో పట్టు పెంచుకోవాలన్న లక్ష్యంతోనే సన్‌షైన్‌ ఈక్విటీలో వాటా పెంచుకున్నట్టు తెలిపింది.

ఇవీ చదవండి:

ఎంఎస్ఎంఈలకు ఏఐ దన్ను

రూపాయి పతనంపై దిగులొద్దు: సంజీవ్‌ సన్యాల్‌

Updated Date - Dec 20 , 2025 | 04:11 AM