కిమ్స్ హాస్పిటల్స్ లాభం రూ 106 కోట్లు
ABN , Publish Date - May 13 , 2025 | 03:26 AM
కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్ (కిమ్స్ హాస్పిటల్స్).. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్ (కిమ్స్ హాస్పిటల్స్).. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.801 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.106 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.637 కోట్లుగా ఉండగా లాభం రూ.72 కోట్లుగా ఉంది. మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,067 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.415 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం అన్ని రకాలుగా బాగుందని, కేరళలో కొత్త హాస్పిటల్‌ను ప్రారంభించటంతో పాటు వివిధ ప్రాంతాల్లో కొత్త యూనిట్లను అందుబాటులోకి తీసుకురావటం ఎంతగానో కలిసి వచ్చిందని కిమ్స్ హాస్పిటల్స్ సీఎండీ బీ భాస్కర్ రావు తెలిపారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో మహారాష్ట్రలోని థానేలో కొత్త హాస్పిటల్‌ను ప్రారంభించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో బెంగళూరులో రెండు కొత్త యూనిట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి
Paytm: పేటీఎంకు మరో దెబ్బ..సంస్థలో 4 శాతం వాటా సేల్ చేస్తున్నారా..
Penny Stock: ఈ స్టాక్‌పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..
Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి