Share News

Stock Market:: ట్రేడింగ్‌లో మిశ్రమ ధోరణికి ఆస్కారం

ABN , Publish Date - Oct 06 , 2025 | 04:55 AM

స్టాక్‌ మార్కెట్‌ ఈ వారంలో మిశ్రమ ధోరణిలో ట్రేడ్‌ కావొచ్చు. మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకరణాలు, ఆర్‌బీఐ సమీక్ష నేపథ్యంలో కొన్ని రంగాల షేర్లు తీవ్ర ప్రభావానికి లోనయ్యే అవకాశముంది...

Stock Market:: ట్రేడింగ్‌లో మిశ్రమ ధోరణికి ఆస్కారం

స్టాక్‌ మార్కెట్‌ ఈ వారంలో మిశ్రమ ధోరణిలో ట్రేడ్‌ కావొచ్చు. మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకరణాలు, ఆర్‌బీఐ సమీక్ష నేపథ్యంలో కొన్ని రంగాల షేర్లు తీవ్ర ప్రభావానికి లోనయ్యే అవకాశముంది. వరుసగా ఎనిమిది సెషన్లు నష్టపోయిన బెంచ్‌మార్క్‌ సూచీలు చివరి రెండు సెషన్లలో భారీగా పెరిగాయి. ఆటోమొబైల్‌, ప్రభు త్వ రంగ బ్యాంకింగ్‌, మెటల్‌, డిఫెన్స్‌, గ్లాస్‌, ఆయిల్‌ అన్వేషణ రంగాలు జోరు ప్రదర్శిస్తున్నాయి.

స్టాక్‌ రికమెండేషన్లు

టాటా స్టీల్‌: కొన్ని నెలలుగా అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ షేరు ప్రస్తుతం కీలకమైన రూ.160 జోన్‌లో ఉంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ మెరుగ్గా ఉంది. ఐరన్‌ అండ్‌ స్టీల్‌ సెక్టార్‌ సైతం జోరు ప్రదర్శిస్తోంది. గత శుక్రవారం 3.4 ు లాభంతో రూ.173 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.195 టార్గెట్‌ ధరతో రూ.170పై శ్రేణిలో పొజిషన్‌ తీసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ : రూ.166.

బంధన్‌ బ్యాంకు: చాలా కాలంగా ఈ షేర్లులో దిద్దుబాటు జరుగుతూనే ఉంది. కొన్ని రోజులుగా ప్రైవేటు బ్యాంకింగ్‌ సెక్టార్‌ మూమెంటమ్‌ మెరుగవుతూ వస్తోంది. గత శుక్రవారం రూ.165 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.185 టార్గెట్‌ ధరతో రూ.160 శ్రేణిలో అక్యూములేట్‌ చేసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.157.

ఆదిత్య బిర్లా క్యాపిటల్‌: ప్రస్తుతం ఈ షేర్లు జీవితకాల గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నాయి. రిలేటివ్‌ స్ట్రెంత్‌, మూమెంటమ్‌ బాగున్నాయి. పైగా అక్యూములేషన్‌ జోన్‌లో ఉన్నాయి. గత శుక్రవారం రూ.303 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు రూ.340 టార్గెట్‌ ధరతో రూ.290 శ్రేణిలో పొజిషన్‌ తీసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ : రూ.280.

ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిటెడ్‌: ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ కౌంటర్లో అక్యూములేషన్‌ జరుగుతోంది. ప్రస్తుతం రివర్సల్‌కు అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.209 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.230 టార్గెట్‌ ధరతో రూ.205 వద్ద పొజిషన్‌ తీసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ : రూ.205.

కోటక్‌ బ్యాంకు: ఆరు నెలలుగా ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లో ఉంది. ఆర్‌బీఐ ద్రవ్వవిధాన సమీక్ష ముగిసిన నేపథ్యంలో వీటిపై ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది. గత శుక్రవారం రూ.2100 ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.2250 టార్గెట్‌ ధరతో రూ. 2050 వద్ద ప్రవేశించవచ్చు. స్టాప్‌లాస్‌ : రూ. 2010.

- మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఇవీ చదవండి:

లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 06 , 2025 | 04:55 AM