Cars Price Hike: జనవరి నుంచి MG మోటార్ కార్ల ధరలు పెంపు!
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:37 PM
వచ్చే ఏడాది జవనరి నుంచి JSW MG కార్ల ధరలు పెంపు ప్రకటన వెలువడింది. మోడల్, వేరియంట్‌ను బట్టి కార్ల ధరల పెంపు ఉంటుందని కంపెనీ తెలిపింది. 2026 జనవరి 01 నుంచి ప్రస్తుత ధరలపై 2 శాతం వరకు పెంచనున్నట్టు ప్రకటించింది.
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 18: భారత్‌లో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ JSW MG మోటార్ ఇండియా తమ వాహనాల ధరలను 2026 జనవరి 01 నుంచి ప్రస్తుత ధరలపై 2 శాతం వరకు పెంచనున్నట్టు ప్రకటించింది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, మాక్రో ఎకనామిక్ కారకాలు వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది.
ఈ ధరల పెంపు మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతుంది. హెక్టర్, ఆస్టర్, కామెట్ EV, విండ్సర్ వంటి పాపులర్ మోడల్స్‌పై ఈ ప్రభావం ఉంటుంది. ఇటీవలే 2026 MG హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌ను రూ.11.99 లక్షల నుంచి లాంచ్ చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది.
మెర్సిడెస్-బెంజ్, BMW వంటి లగ్జరీ కార్ల కంపెనీలు కూడా 2026 జనవరి నుంచి ధరలు పెంచుతున్నాయి. కారు కొనాలని ప్లాన్ చేస్తున్నవారు డిసెంబర్‌లోనే బుక్ చేసుకోవడం మంచిది! JSW MG మోటార్ ఈవీ రంగంలో కూడా బలోపేతమవుతోంది.
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?
For More Latest News