మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలోకి జియో ఫైనాన్షియల్
ABN , Publish Date - May 28 , 2025 | 05:41 AM
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎ్‌ఫఎ్‌సఎల్) మ్యూచువల్ ఫండ్ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేందుకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ వ్యాపారం కోసం అమెరికాకు చెందిన బ్లాక్‌రాక్, జేఎ్‌ఫఎ్‌సఎల్ కలిసి...
న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎ్‌ఫఎ్‌సఎల్) మ్యూచువల్ ఫండ్ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేందుకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ వ్యాపారం కోసం అమెరికాకు చెందిన బ్లాక్‌రాక్, జేఎ్‌ఫఎ్‌సఎల్ కలిసి ‘జియో బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో సమ భాగస్వామ్య కంపెనీని ఏర్పాటు చేశాయి. కాగా, ‘జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్’కు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీతో పాటు దీనికి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీగా వ్యవహరించేందుకు జియో బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సెబీ అనుమతులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో జేఎ్‌ఫఎ్‌సఎల్ షేరు బీఎ్‌సఈలో 3.46 శాతం లాభపడి రూ.291.50 వద్ద ముగిసింది.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి