Share News

Reliance Industries, Jio Users: ఎంపిక చేసిన జియో 5జీ యూజర్లకు ఉచితంగా గూగుల్‌ ఏఐ ప్రో సేవలు

ABN , Publish Date - Oct 31 , 2025 | 05:55 AM

Jio 5G Users to Get Free Google AI Pro Services Worth rupees 35100

Reliance Industries, Jio Users: ఎంపిక చేసిన జియో 5జీ యూజర్లకు ఉచితంగా గూగుల్‌ ఏఐ ప్రో సేవలు

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కృత్రిమ మేధ(ఏఐ) అనుబంధ విభాగమైన రిలయన్స్‌ ఇంటెలిజెన్స్‌ తాజాగా గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తద్వారా రిలయన్స్‌ జియోకు చెందిన ఎంపిక చేసిన (18-25 ఏళ్లలోపు) 5జీ వినియోగదారులకు రూ.35,100 విలువైన ‘గూగుల్‌ ఏఐ ప్రో’ సేవలను 18 నెలల పాటు ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గురువారం ప్రకటించింది. ఈ ఉచిత సేవల్లో భాగంగా గూగుల్‌ జెమినీ యాప్‌లో జెమినీ 2.5 ప్రో మోడల్‌ యాక్సె్‌సతో పాటు అన్‌లిమిటెడ్‌ చాట్స్‌, 2 టీబీ క్లౌడ్‌ స్టోరేజీ, వీఈఓ 3.1పై వీడియో జనరేషన్‌, నానో బనానా ద్వారా ఇమేజ్‌ జనరేషన్‌, అధ్యయనం, పరిశోధన కోసం నోట్‌బుక్‌ ఎల్‌ఎంకు విస్తృత యాక్సె్‌స సహా ఇతర అధునిక ఏఐ టూల్స్‌ను వినియోగించుకునే అవకాశం అర్హులైన వినియోగదారులకు లభించనుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. రాష్ట్రపతి ఉత్తర్వులు

జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 31 , 2025 | 05:55 AM