Share News

Jayshree Ulla Arista Networks CEOl: టెకీల్లో అత్యంత రిచ్‌ జయశ్రీ ఉల్లాల్‌

ABN , Publish Date - Dec 28 , 2025 | 05:46 AM

Jayshree Ullal Tops Richest Indian Tech Women List with Rupees 51300 Crore Net Worth

Jayshree Ulla Arista Networks CEOl: టెకీల్లో అత్యంత రిచ్‌ జయశ్రీ ఉల్లాల్‌

ఆస్తుల నికర విలువ రూ.51,300 కోట్లు

సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌లు వెనక్కు

న్యూఢిల్లీ: ఆస్తుల సంపాదనలోనూ భారత సంతతి టెక్‌ దిగ్గజాలు దూసుకుపోతున్నారు. క్యాన్‌డేర్‌ హురున్‌ ఇండియా ఉమెన్‌ లీడర్స్‌ లిస్ట్‌ 2025లో అరిస్టా నెట్‌వర్క్స్‌ సీఈఓ జయశ్రీ ఉల్లాల్‌ (63) అనే భారత సంతతి మహిళా టెకీ అగ్రస్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆమె సంపద నికర విలువ 570 కోట్ల డాలర్లు. ప్రస్తుత భారత కరెన్సీ మారకం రేటు ప్రకారం ఇది సుమారు రూ.51,300 కోట్లకు సమానం. ఇది మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల (110 కోట్ల డాలర్లు), గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ (150 కోట్ల డాలర్లు)ల ఆస్తుల కంటే ఎంతో ఎక్కువ. ప్రస్తుతం భారత సంతతి టెకీల్లో ఎవరి నికర ఆస్తుల విలువ ఈ స్థాయిలో లేదు.

కంపెనీ నేపథ్యం: బ్రిటన్‌లో పుట్టి పెరిగిన జయశ్రీ ఉల్లాల్‌ అమెరికాలో ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్య పూర్తి చేశారు. 2008 సెప్టెంబరులో అరిస్టా నెట్‌వర్క్స్‌ కంపెనీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి అదే కంపెనీకి సీఈఓ, ప్రెసిడెంట్‌ స్థాయికి ఎదిగారు. ఈ కంపెనీ పెద్దపెద్ద డేటా కేంద్రాలు, క్లౌడ్‌ సర్వీస్‌ కంపెనీలకు క్లౌడ్‌ ఆధారిత హై పెర్‌ఫార్మెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధారిత స్విచ్‌లు, సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు అందజేస్తోంది.

ఇవీ చదవండి:

సూపర్.. ప్రపంచంలో నెం.3 స్థానానికి చేరిన వెండి!

ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 16 శాతం వృద్ధి

Updated Date - Dec 28 , 2025 | 05:46 AM