Share News

ఐటీసీ హోటల్స్‌ షేరు 5 శాతం డౌన్‌

ABN , Publish Date - Jan 30 , 2025 | 02:21 AM

ఐటీసీ హోటల్స్‌ లిమిటెడ్‌ షేరు బుధవారం స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్టయింది. బీఎ్‌సఈలో రూ.188 వద్ద లిస్టయిన షేరు.. తొలిరోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి 5 శాతం నష్టంతో రూ.178.60 వద్దకు...

ఐటీసీ హోటల్స్‌ షేరు 5 శాతం డౌన్‌

ఐటీసీ హోటల్స్‌ లిమిటెడ్‌ షేరు బుధవారం స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్టయింది. బీఎ్‌సఈలో రూ.188 వద్ద లిస్టయిన షేరు.. తొలిరోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి 5 శాతం నష్టంతో రూ.178.60 వద్దకు జారుకుంది. దాంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.37,169.71 కోట్లుగా నమోదైంది. దేశంలోని అతిపెద్ద వ్యాపార గ్రూప్‌ల్లో ఒకటైన ఐటీసీ లిమిటెడ్‌.. తన హోటళ్ల వ్యాపారాన్ని ప్రత్యేక సంస్థగా విభజించింది. ఈ జనవరి 1 నుంచి వ్యాపార విభజన అమల్లోకి రాగా.. ఐటీసీ హోటల్స్‌ షేర్ల కేటాయింపునకు అర్హులైన వాటాదారులను ఈనెల 6న గుర్తించారు. డీమెర్జర్‌ పథకం ప్రకారం.. ఐటీసీ లిమిటెడ్‌ షేర్‌హోల్డర్లు తాము కలిగి ఉన్న ప్రతి 10 షేర్లకుగాను ఐటీసీ హోటల్స్‌ లిమిటెడ్‌కు చెందిన షేరు ఒకటి లభించింది.


వచ్చే ఐదేళ్లలో 200కు పైగా హోటళ్లు

ఐటీసీ హోటల్స్‌ వ్యాపారాన్ని వేగంగా విస్తరించాలనుకుంటోంది. వచ్చే ఐదేళ్లలో హోటళ్ల సంఖ్యను 200 పై స్థాయికి పెంచుకోవాలనుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఐటీసీ హోటల్స్‌ దేశవ్యాప్తంగా 140కి పైగా హోటళ్లను నిర్వహిస్తోంది.


ఇవి కూడా చదవండి:

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో


Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 30 , 2025 | 02:21 AM