Share News

Stocks Markets Down: ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు

ABN , Publish Date - Jul 12 , 2025 | 03:34 AM

ఐటీ, ఆటో, ఎనర్జీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి శుక్రవారం మార్కెట్‌ను కుంగదీసింది.

Stocks Markets Down: ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు

ముంబై: ఐటీ, ఆటో, ఎనర్జీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి శుక్రవారం మార్కెట్‌ను కుంగదీసింది. కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌కు ఐటీ దిగ్గజం టీసీఎస్‌ నిరుత్సాహపూరితమైన ప్రారంభం అందించడం ఐటీ, ఆటో, ఇంధన కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడిని పెంచింది. దీనికి తోడు టారిఫ్‌ సంబంధిత అస్థిరతలు, ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన మిశ్రమ సంకేతాలు మార్కెట్‌పై ప్రభావం చూపాయి. సెన్సెక్స్‌ 689.91 పాయింట్ల నష్టంతో 82,500.47 వద్ద స్థిరపడగా నిఫ్టీ 205.40 పాయింట్ల నష్టంతో 25,149.85 వద్ద క్లోజైంది. రిజిస్టర్‌ కాని ఆన్‌లైన్‌ బాండ్‌ వేదికలను నమ్మొద్దు: వివిధ స్థిరాదాయ పెట్టుబడి సాధనాల కు ప్రవేశం కల్పిస్తున్న రిజిస్టర్‌ కాని ఆన్‌లైన్‌ బాండ్‌ ప్లాట్‌ఫామ్స్‌ను విశ్వసించవద్దని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ తమ ఇన్వెస్టర్లను హెచ్చరించాయి. ఆన్‌లైన్‌ బాండ్లలో పెట్టుబడులు పెట్టే సమయంలో కంపెనీలకు సంబంధించిన విశ్వసనీయ అంశాలను పరిశీలించాలని తెలిపాయి. ప్రధానంగా బాండ్ల క్రెడిట్‌ రేటింగ్‌, జారీ చేస్తున్న సంస్థ చెల్లింపుల రికార్డు, లిక్విడిటీ, సెటిల్‌మెంట్‌ కాలపరిమితి, పన్ను భారం వంటివి పరిశీలించాలని సూచించాయి.

Updated Date - Jul 12 , 2025 | 03:34 AM