Share News

October 7 Bank Holiday: అక్టోబర్ 7న ఈ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.. స్టాక్ మార్కెట్ ఉంటుందా..

ABN , Publish Date - Oct 06 , 2025 | 08:42 PM

భారత సంస్కృతి, సాహిత్యానికి ఆదర్శంగా నిలిచిన మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 7, 2025న మంగళవారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ప్రకటించాయి. అయితే ఎక్కడెక్కడ సెలవు ఉందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

October 7 Bank Holiday: అక్టోబర్ 7న ఈ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.. స్టాక్ మార్కెట్ ఉంటుందా..
October 7 bank holiday

మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా అక్టోబర్ 7, 2025 మంగళవారం రోజు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు (October 7 bank holiday) ప్రకటించారు. వాల్మీకి మహర్షి భారత సంస్కృతి, సాహిత్యంలో ఎంతో గొప్ప స్థానం కలిగిన ఋషి. ఆయన రామాయణ రచయితగా ఆది కవిగా గుర్తింపు పొందారు. అందుకే ఈ రోజుని పురస్కరించుకుని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలు బ్యాంకులకు సెలవు ప్రకటించాయి.


ఎక్కడెక్కడ సెలవు ఉంది?

భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) ప్రకారం, అక్టోబర్ 7న కర్ణాటక, ఒడిశా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. ఇదే సమయంలో ఈ నాలుగు రాష్ట్రాల్లో మహర్షి వాల్మీకి జయంతి, కుమార పౌర్ణమి పండుగలను కూడా ఘనంగా నిర్వహిస్తారు. అందుకే ఈ ప్రత్యేక సందర్భాన్ని గౌరవిస్తూ ప్రభుత్వం సెలవును ప్రకటించింది.


మిగిలిన రాష్ట్రాల్లో ఎలా ఉంటుంది?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ వంటి మిగతా రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయి. రోజువారీ లావాదేవీలు, క్యాష్ ట్రాన్సాక్షన్లు, చెక్ క్లియరెన్స్, కస్టమర్ సేవలు కొనసాగతాయి.


స్టాక్ మార్కెట్లు ఎలా ఉంటాయి?

బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) అక్టోబర్ 7న కూడా పనిచేస్తాయి. కానీ ట్రేడింగ్ కార్యకలాపాలు నెమ్మదిగా కొనసాగవచ్చు. తర్వాత స్టాక్ మార్కెట్ హాలిడే అక్టోబర్ 21న దీపావళి సందర్భంగా ఉంటుంది.

మీ వ్యాపారం బ్యాంక్ సంబంధిత సేవలపై ఆధారపడి ఉంటే మీకు అవసరమైన ట్రాన్సాక్షన్లు ముందుగానే పూర్తి చేసుకోవడం బెస్ట్. ముఖ్యంగా కర్ణాటక, ఒడిశా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాపారం ఉన్న వారు ఈ సెలవును పరిగణనలోకి తీసుకొని మీ వ్యాపార ప్రణాళికను సర్దుబాటు చేసుకోవాలి. కానీ డిజిటల్ చెల్లింపులు, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం సెలవు రోజున కూడా అందుబాటులో ఉంటాయి.


ఇవీ చదవండి:

లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 06 , 2025 | 08:45 PM