Share News

IPO News: ఐపీఓకు మరో రెండు కంపెనీలు.. వివరాలు, ధరల శ్రేణి..

ABN , Publish Date - Feb 12 , 2025 | 04:32 PM

పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, ఆటోమేషన్ వంటి రంగాలతో పాటు గ్రిడ్ కనెక్టివిటీ, ఎనర్జీ ట్రాన్స్ మిషన్ కోసం హై వోల్టాజ్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్, సొల్యూషన్స్ ని అందించే కంపెనీ అయిన క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ సంస్థ ఐపీవో వాలైంటెన్స్ డే అయిన ఫిబ్రవరి 14న ఓపెన్ కాబోతోంది.

IPO News: ఐపీఓకు మరో రెండు కంపెనీలు.. వివరాలు, ధరల శ్రేణి..
IPO

ఈ వారంలో మరో రెండు కొత్త కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ (IPO)కు రాబోతున్నాయి. ఐపీఓలలో పెట్టుబడి పెట్టి భారీగా లిస్టింగ్ గెయిన్స్ పొందాలని భావించే వారి కోసం ఒక కొత్త మెయిన్ బోర్డు ఐపీఓ అందుబాటులోకి రాబోతోంది. పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, ఆటోమేషన్ వంటి రంగాలతో పాటు గ్రిడ్ కనెక్టివిటీ, ఎనర్జీ ట్రాన్స్ మిషన్ కోసం హై వోల్టాజ్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్, సొల్యూషన్స్ ని అందించే కంపెనీ అయిన క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ సంస్థ ఐపీవో వాలైంటెన్స్ డే అయిన ఫిబ్రవరి 14న ఓపెన్ కాబోతోంది (Business News).


క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఐపీఓ ఫిబ్రవరి 14న ఓపెన్ అయ్యి ఫిబ్రవరి 18న ముగుస్తుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం రూ. 858.70 కోట్లను సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది. క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ను ఒక్కో ఈక్విటీ షేరుకి రూ. 401- 425గా కంపెనీ నిర్ణయించింది. ఒక్కో లాట్‌కు 26 షేర్లను కేటాయించారు. అంటే కనీసం రూ.11, 050 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ కంపెనీ షేర్లు ఫిబ్రవరి 21న ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి.


పెట్రోలియం, చమురు, లూబ్రికెంట్స్‌ను నిల్వ చేసే టెర్మినల్స్‌కు ఆటోమేషన్ పరిష్కారాలను అందించే అడ్వాన్స్‌డ్ సిస్ టెక్ సంస్థ కూడా ఐపీవోకు రావడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఐపీవో (IPO) ద్వారా నిధులను సేకరించడానికి అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో ద్వారా సేకరించే నిధులను డబ్బును పెట్టుబడి, దీర్ఘకాలిక అవసరాల కోసం ఉపయోగిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 12 , 2025 | 04:32 PM