Investing in Gold and Silver: పసిడిలో పెట్టుబడి లాభాలకు భరోసా
ABN , Publish Date - Oct 05 , 2025 | 05:26 AM
బులియన్ మార్కెట్ పరుగెడుతోంది. బంగారం, వెండి ధరలు చుక్కలంటుతున్నాయి. ఈ రెండులోహాల ధరలు ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక...
బులియన్ మార్కెట్ పరుగెడుతోంది. బంగారం, వెండి ధరలు చుక్కలంటుతున్నాయి. ఈ రెండులోహాల ధరలు ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం వీటిని ఎంచుకోవచ్చా...ఎంచుకుంటే ఎలా కొనాలి? పన్ను పోటు ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
బంగారం, వెండి ధరలు రేసుగుర్రాల్లా పరుగెడుతున్నాయి. ఈ రెండు లోహాల ధరలు ఇప్పటికే రికార్డు స్థాయిలకు చేరాయి. ప్రస్తుతం పది గ్రాముల మేలిమి బంగారం రూ.1.2 లక్షలు, కిలో వెండి రూ.1.52 లక్షలకు చేరి జీవితకాల గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు చూసినా ఈ రెండు లోహాల ధర 50 శాతానికి పైగా పెరిగింది. దీంతో ఆభరణాల తయారీ కంటే.. పెట్టుబడి లాభాల కోసం కొనే వారి సంఖ్య పెరిగిపోతోంది. సురక్షిత పెట్టుబడులుగా వీటికి ఉన్న పేరు మరింత మంది ఇన్వెస్టర్లను వాటి వైపు ఆకర్షిస్తోంది. చివరికి భారత్, చైనాతో పాటు అనేక దేశాల కేం ద్ర బ్యాంకులు కూడా తమ ఫారెక్స్ నిల్వల నిర్వహణలో భాగంగా పెద్దఎత్తున పసిడి కొనుగోలు చేస్తున్నాయి.
దీర్ఘకాలిక రాబడులు
గత రెండు దశాబ్దాలుగా చూసినా బంగారం, వెండి పెట్టుబడులు మదుపరులకు మంచి లాభాలే పంచాయి. గత 20 సంవత్సరాల్లో పసిడి ధర ఏటా సగటున 14.9ు చొప్పున పెరిగితే, వెండి ధర 13.01ు చొప్పున పెరిగింది. ఇదే సమయంలో నిఫ్టీ-50 సూచీ 14.6ు, రియల్ ఎస్టేట్ 7.7ు చొప్పున పెరిగాయి. నిఫ్టీ-50 దీర్ఘకాలిక రాబడులు గత 20 ఏళ్లలో దాదాపుగా పసిడి, వెండి స్థాయిల్లోనే ఉన్నాయి. అయినా మదుపరులు ఈ కాలంలో అనేక ఆటుపోట్లు, ఆందోళన ఎదుర్కొన్నారు. కొవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలతో నెలకొన్న పరిస్థితులే ఇందుకు ఉదాహరణ. బులియన్ మార్కెట్ దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మాత్రం దాదాపుగా ఈ టెన్షన్లు లేవనే చెప్పాలి.
పెట్టుబడి మార్గాలు
ప్రస్తుతం బంగారం, వెండిలో మదుపు చేయడానికి అనేక మార్గాలున్నాయి. అవేమిటంటే..
భౌతికంగా కొనుగోలు
ఇంట్లో భద్రతకు ఢోకా లేదనుకుంటే భౌతికంగా బంగారం కొని నగ నట్రా లేదా నాణేలు, బార్స్ రూపంలో భద్రంగా దాచుకోవచ్చు. కాకపోతే ఇందులో రిస్క్ ఎక్కువ. ఎప్పుడు ఏ దొంగోడు కన్నమేసి దోచుకుపోతాడో తెలియదు. బీమా చేయించుకుని లేదా బ్యాంకు లాకర్లలో పెట్టి వీటిని కాపాడుకోవడం ఉత్తమం.
గోల్డ్ ఈటీఎ్‌ఫలు
ఇటీవల మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) నిర్వహించే గోల్డ్ ఈటీఎ్‌ఫలకు మదుపరుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మదుపరుల నుంచి సేకరించే ఈ నిధులను ఎంఎ్‌ఫలు 99.5ు స్వచ్ఛత ఉండే బంగారంలో పెట్టుబడి పెడతాయి. మదుపరులు వీటి నెట్ అసెట్ వాల్యూను (ఎన్‌ఏవీ) ఎప్పటికప్పుడు షేర్ల ధరల్లా చెక్ చేసుకోవ చ్చు. మార్కెట్ రేటుకు అనుగుణంగా వీటి ఎన్‌ఏవీ ఏ రోజుకు ఆ రోజు మారుతుంటుంది. భౌతిక బంగారాన్ని కొని ఇంట్లో దాచుకోవడం సమస్య అనుకునే మదుపరులకు గోల్డ్ ఈటీఎ్‌ఫలు అత్యుత్తమ పెట్టుబడి సాధనం.
- క్రమానుగత పెట్టుబడి పద్దతిలోనూ (సిప్) వీటిల్లో మదుపు చేయవచ్చు. కంపెనీల షేర్లలా ఎప్పుడు డబ్బులు అవసరమైతే అప్పుడు అమ్ముకుని నగదు చేసుకోవచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్స్
నిన్న మొన్నటి వరకు ఫిజికల్ గోల్డ్ వద్దనుకునే వారి కోసం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (జీఎంఎస్), సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్‌జీబీ) అందుబాటులో ఉండేవి. ఇటీవలే ప్రభుత్వం వీటిని నిలిపివేసింది. అయినా సెకండరీ మార్కెట్లో ఎస్‌జీబీలు ఇంకా దొరుకుతున్నాయి.
ఎలకా్ట్రనిక్ గోల్డ్ రిసీట్స్
కొన్ని యాప్‌లు, సంస్థలు అందించే ఎలకా్ట్రనిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్) పైనా మదుపరులు దృష్టి పెట్టవచ్చు. అయితే నమ్మకమైన, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి ఉన్న యాప్‌ల నుంచి మాత్రమే ఈ కొనుగోళ్లు చేయడం మంచిది. నగదు అవసరమనుకుంటే వీటిని స్టాక్ ఎక్స్చేంజీల్లో టీ+1 పద్దతిలో అమ్మి సొమ్ము చేసుకోవచ్చు.
స్వచ్ఛత
బంగారం లేదా వెండిలో పెట్టుబడి పెట్టేటపుడు వాటి స్వచ్ఛత అత్యంత ముఖ్యం. హాల్‌మార్కింగ్ వచ్చినా, ఇంకా చాలా మంది బులియన్ వ్యాపారులు తక్కువ స్వచ్ఛత ఉన్న బంగారం, వెండిని అత్యంత స్వచ్ఛమైనవి గా ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. పెద్దపెద్ద మాల్స్‌లో ఈ మోసాలు లేకపోయినా, చిన్న చిన్న నగల దుకాణాల్లో ఎక్కువగా జరుగుతున్నా యి. పెట్టుబడి లాభాల కోసమే కొనాలనుకుంటే హాల్‌మార్క్ ఉన్న 99.9 శాతం స్వచ్ఛత ఉండే బంగారం, వెండి మాత్రమే కొనుగోలు చేయటం మంచిది.
పన్ను
పోటు
కొన్న బంగారం, వెండిని ఎంత కాలం ఉంచుకుని అమ్మాలనే విష యం ఆధారంగా పన్నుపోటు ఉం టుంది. రెండేళ్లలోపు అమ్మితే వచ్చే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా (ఎస్‌టీసీజీటీ) పరిగణిస్తారు. ఈ లాభాన్ని ఆయా వ్యక్తుల ఆదాయానికి జోడించి, వారి శ్లాబు ప్రకారం ఆదాయ పన్ను విధిస్తారు. అదే రెండేళ్ల తర్వాత అమ్మితే వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా (ఎల్‌టీసీజీటీ) పరిగణిస్తారు. గత ఏడాది జూలై 23 నుంచి ఈ లాభాలపై ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకుండా 12.5ు పన్ను విధిస్తున్నారు. గోల్డ్ డిపాజిట్ సర్టిఫికెట్లు, సావరిన్ గోల్డ్ బాండ్స్‌పై వచ్చే లాభాలపై మాత్రం ఎలాం టి పన్నుపోటు ఉండదు.
పెట్టుబడి ఎందుకంటే?
దీర్ఘకాలికంగా చూస్తే పసిడి, వెండి పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్ లాభాలకు ప్రత్యామ్నాయం కాదు. బుల్ మార్కెట్లో బులియన్ మార్కెట్ నీరసిస్తే.. ఈక్విటీ మార్కెట్లు రేసుగుర్రాల్లా పరుగెడతాయి. అయినా ప్రతి మదుపరి తన పెట్టుబడుల్లో కనీసం 15 నుంచి 20 శాతమైనా బులియన్ మార్కెట్లో ఉంచుకోవడం మంచిది. ఆర్థిక ఆటుపోట్లు, అంతర్జాతీయ ఉద్రిక్తతల సమయంలో పెట్టుబడుల విలువ తగ్గిపోకుండా ఈ రెండూ అడ్డుకుంటాయి. ఏ మాత్రం రిస్కు తీసుకోలేని మదుపరులైతే బ్యాంకు డిపాజిట్లు, రుణపత్రాల కంటే బంగారం లేదా వెండిని ఎంచుకోవడమే మంచిది. పెట్టుబడులకు పెద్దగా ఢోకా లేకుండానే ఈ రెండు లోహాలు దీర్ఘకాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రుణ పత్రాల కంటే ఎక్కువ రాబడులు ఇస్తాయి. గత రెండు దశాబ్ధాల అనుభవమూ ఇదే చెబుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్ సీఎం
PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ