Investment In Education: విద్యపై పెట్టుబడితో వచ్చేదే అత్యుత్తమ రాబడి
ABN , Publish Date - Sep 06 , 2025 | 02:50 AM
విద్యపై పెట్టే పెట్టుబడులపై వచ్చే రాబడులే అత్యుత్తమ రాబడులని మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ ట్రస్టీ రామ్‌దేవ్ అగర్వాల్ అన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎ్‌సబీ)లో...
మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ ట్రస్టీ రామ్‌దేవ్ అగర్వాల్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): విద్యపై పెట్టే పెట్టుబడులపై వచ్చే రాబడులే అత్యుత్తమ రాబడులని మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ ట్రస్టీ రామ్‌దేవ్ అగర్వాల్ అన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎ్‌సబీ)లో మోతీలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ (ఎంఓఈసీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఉద్దేశంతోనే ఐఎ్‌సబీలో ఎంఓఈసీ ఏర్పాటుకు రూ.100 కోట్లు సమకూర్చినట్టు తెలిపారు. లెర్న్, ఎర్న్ (నేర్చుకో, సంపాదించు) అనేది తమ సిద్ధాంతమన్నారు. సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని మన జీవిత కాలంలోనే దేశానికి, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు ఇవ్వాలనే విషయాన్ని కూడా తాము ధృడంగా నమ్ముతామన్నారు. ఈ లక్ష్యంతోనే అనేక విద్యా సంస్థలకు మోతీలాల్ ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూరుస్తున్నట్టు అగర్వాల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..