Share News

హైదరాబాద్‌ స్టార్టప్‌లో ఇండిగో వెంచర్స్‌ పెట్టుబడి

ABN , Publish Date - Jul 10 , 2025 | 05:35 AM

హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ కంపెనీ జే ఏరోస్పేస్‌లో పెట్టుబడి పెట్టినట్టు ఇండిగో విమానయాన సంస్థ అనుబంధ వెంచర్‌ క్యాపిటల్‌ విభాగం ఇండిగో వెంచర్స్‌ ప్రకటించింది...

హైదరాబాద్‌ స్టార్టప్‌లో ఇండిగో వెంచర్స్‌ పెట్టుబడి

ముంబై: హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ కంపెనీ జే ఏరోస్పేస్‌లో పెట్టుబడి పెట్టినట్టు ఇండిగో విమానయాన సంస్థ అనుబంధ వెంచర్‌ క్యాపిటల్‌ విభాగం ఇండిగో వెంచర్స్‌ ప్రకటించింది. అయితే ఎంత మొత్తం పెట్టుబడి పెట్టిందీ వెల్లడించలేదు. జే ఏరోస్పేస్‌ కంపెనీ ఈ నిధులను డిజిటల్‌ ఉత్పత్తి సామ ర్థ్యాల పెంపుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఏఐ ఆధారిత ఉత్పత్తి విధానాలు, నిపుణులైన ఉద్యోగుల నియామకానికి ఉపయోగించుకుంటుందంటున్నారు. ప్రారంభ దశలో ఉన్న స్టార్ట్‌ప్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు తాము లక్ష్యంగా పెట్టుకున్న రూ.600 కోట్లలో ఇప్పటికే రూ.450 కోట్లు సమీకరించినట్టు ఇండిగో వెంచర్స్‌ తెలిపింది.


ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 11:38 AM