India Trade Deficit: రికార్డు గరిష్ఠానికి వాణిజ్య లోటు
ABN , Publish Date - Nov 18 , 2025 | 06:19 AM
ట్రంప్ సుంకాల దెబ్బకు భారత మొత్తం వస్తు ఎగుమతులు కూడా అక్టోబరు నెలలో 11.8 శాతం పతనమై 3,438 కోట్ల డాలర్లకు (రూ.3,04,572 కోట్లు) తగ్గాయి. పసిడి, వెండితో...
ట్రంప్ సుంకాల దెబ్బకు భారత మొత్తం వస్తు ఎగుమతులు కూడా అక్టోబరు నెలలో 11.8 శాతం పతనమై 3,438 కోట్ల డాలర్లకు (రూ.3,04,572 కోట్లు) తగ్గాయి. పసిడి, వెండితో పాటు పత్తి, ఎరువులు, సల్ఫర్ దిగుమతులు అనూహ్యంగా పెరగడంతో మొత్తం దిగుమతులు కూడా 16.63 శాతం ఎగబాకి 7,606 కోట్ల డాలర్లకు (రూ.6,73,815 కోట్లు) చేరాయి. దీంతో గత నెల వాణిజ్య లోటు (ఎగుమతి ఆదాయం, దిగుమతి వ్యయానికి మధ్య వ్యత్యాసం) రికార్డు గరిష్ఠ స్థాయి 4,168 కోట్ల డాలర్ల (రూ.3,69,243 కోట్లు)కు పెరిగింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరుతో ముగిసిన 7 నెలల్లో భారత ఎగుమతులు కేవలం 0.63 శాతం వృద్ధితో 25,425 కోట్ల డాలర్లు, దిగుమతులు 6.37 శాతం పెరుగుదలతో 45,108 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. దాంతో వాణిజ్య లోటు 19,682 కోట్ల డాలర్లకు పెరిగింది.
ఇవి కూడా చదవండి:
అమెరికాలో నిపుణులైన వర్కర్ల కొరత ఉంది.. ఫోర్డ్ సీఈఓ ఆందోళన
అమెరికాలో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోతలు.. సంచలన నివేదికలో వెల్లడి
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి