India Trade Deficit: 13 నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు
ABN , Publish Date - Oct 16 , 2025 | 05:07 AM
ఈ ఏడాది సెప్టెంబరులో వాణిజ్య లోటు 11 నెలల గరిష్ఠ స్థాయి 3,215 కోట్ల డాలర్లకు పెరిగింది. గత నెలలో ఎగుమతులు 6.74ు వృద్ధితో 3,638 కోట్ల డాలర్లకు పరిమితం కాగా...
సెప్టెంబరులో 3,215 కోట్ల డాలర్లకు చేరిక
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబరులో వాణిజ్య లోటు 11 నెలల గరిష్ఠ స్థాయి 3,215 కోట్ల డాలర్లకు పెరిగింది. గత నెలలో ఎగుమతులు 6.74ు వృద్ధితో 3,638 కోట్ల డాలర్లకు పరిమితం కాగా.. దిగుమతులు మాత్రం ఏకంగా 16.6ు పెరిగి 6,853 కోట్ల డాలర్లకు చేరడం ఇందుకు కారణం. కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 3.02ు వృద్ధితో 22,012 కోట్ల డాలర్లకు చేరాయి. దిగుమతులు కూడా 4.53ు పెరుగుదలతో 37,511 కోట్ల డాలర్లకు ఎగబాకాయి. ఫలితంగా వాణిజ్య లోటు 15,499 కోట్ల డాలర్లుగా నమోదైంది. గతనెలలో బంగారం దిగుమతులు 960 కోట్ల డాలర్లకు పెరిగాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telugu News