India Direct Tax Collections: పన్ను వసూళ్లు రూ 12.92 లక్షల కోట్లు
ABN , Publish Date - Nov 12 , 2025 | 05:03 AM
వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (ఈ నెల 10 నాటికి) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 7ు వృద్ధితో రూ.12.92 లక్షల కోట్లు దాటా యి. కార్పొరేట్ పన్ను వసూళ్లు...
న్యూఢిల్లీ: వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (ఈ నెల 10 నాటికి) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 7ు వృద్ధితో రూ.12.92 లక్షల కోట్లు దాటా యి. కార్పొరేట్ పన్ను వసూళ్లు పుంజుకోవడంతోపాటు రిఫండ్లు నెమ్మదించడం ఇందుకు దోహదపడింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.12.08 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. మరిన్ని విషయాలు..
ఈ ఏప్రిల్ 1- నవంబరు 10 మధ్యకాలంలో రిఫండ్ల జారీ వార్షికంగా 18ు తగ్గి రూ.2.42 లక్షల కోట్లకు పరిమితమైంది. నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.5.37 లక్షల కోట్లకు పెరిగాయి.
వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు సహా కార్పొరేటేతర పన్ను నికర వసూళ్లు రూ.7.19 లక్షల కోట్లకు ఎగబాకాయి. 2024-25లో ఇదే కాలానికి కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.5.08 లక్షల కోట్లు, కార్పొరేటేతర పన్ను వసూళ్లు రూ.6.62 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) వసూళ్లు రూ.35,682 కోట్లుగా ఉన్నాయి. 2024-25లో ఇదే సమయానికి నమోదైన రూ.35,923 కోట్ల వసూళ్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి.
రిఫండ్లు మినహాయించకముందు, స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 2.5 శాతం వృద్ధితో రూ.15.35 లక్షల కోట్లకు చేరాయి. - 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 12.7 శాతం పెరిగి రూ.25.20 లక్షల కోట్ల చేరుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో అంచనా వేసింది. అందులో ఎస్‌టీటీ వసూళ్లు రూ.78,000 కోట్లుగా ఉండవచ్చని అంచనా.
ఇవి కూడా చదవండి:
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..