Share News

మన దిగుమతి సుంకాలు తక్కువే

ABN , Publish Date - Jun 25 , 2025 | 02:01 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మన దేశాన్ని పదే పదే సుంకాల రారాజుగా అభివర్ణించడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్రంగా తప్పు పట్టారు...

మన దిగుమతి సుంకాలు తక్కువే

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మన దేశాన్ని పదే పదే సుంకాల రారాజుగా అభివర్ణించడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్రంగా తప్పు పట్టారు. మన దిగుమతి సుంకాలు ఆసియాన్‌ దేశాలతో సమానం గా సగటున 10.66 శాతం మాత్రమే ఉన్నాయన్నారు. అమలుకు వచ్చే సరికి ఈ రేట్లు ఇంకా తక్కువగా ఉన్నట్టు తెలిపారు. ఇండియా ఎగ్జిమ్‌ బ్యాంకు నిర్వహించిన ఒక సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) కోసం అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) కూటమితో జరుగుతున్న చర్చలు త్వరలోనే ఒక కొలిక్కి వస్తాయని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఇందుకోసం ఈ దేశాలతో జరుగుతున్న చర్చలు సజావుగానే జరుగుతున్నాయన్నారు.

ఇవీ చదవండి:

హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్‌ తట్టుకోగలదా

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 02:01 AM