Green Investments India: హరిత పెట్టుబడులతో 2047 నాటికి కోట్ల కొలువులు
ABN , Publish Date - Nov 27 , 2025 | 02:58 AM
పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే పెట్టుబడులు మన ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద ఊతం కానున్నాయి. 2047 నాటికి ఈ రంగంలోకి వచ్చే 4.1 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.364.9 లక్షల కోట్లు) పెట్టుబడులతో...
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే పెట్టుబడులు మన ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద ఊతం కానున్నాయి. 2047 నాటికి ఈ రంగంలోకి వచ్చే 4.1 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.364.9 లక్షల కోట్లు) పెట్టుబడులతో సుమారు 4.8 కోట్ల పూర్తి స్థాయి ఉద్యోగాలు ఏర్పడనున్నాయి. ఇంధన, పర్యావరణ, జల మండలి (సీఈఈడబ్ల్యు) ఒక నివేదికలో ఈ విషయం తెలిపింది. దీంతో 2047 నాటికి దేశంలో పర్యావరణ హిత వస్తువుల మార్కెట్ కూడా 110 లక్షల డాలర్లకు (సుమారు రూ.97.9 లక్షల కోట్లు) చేరుతుందని అంచనా వేసింది. శిలాజ ఇంధనాల నుంచి హరిత ఇంధనాలకు మారడం, పునరుత్పాదక విధానాలు, ప్రకృతి ఆధారిత ఉత్పత్తులు వంటి రంగాల్లో భారత్‌లో భారీ అవకాశాలు ఉన్నట్టు సీఈఈడబ్ల్యు తెలిపింది.
ఇవీ చదవండి:
డిసెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ప్లాన్ చేస్కోండి.!
మీ చిన్నారులకు పాన్ కార్డ్ తీసుకోండి.. ఇన్వెస్ట్‌మెంట్‌పై అవగాహన కల్పించండి!