India GDP Growth: ఈ ఏడాది భారత వృద్ధి రేటు 7.3 శాతం
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:48 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 7.2-7.3 శాతం మధ్యన ఉండొచ్చని బ్రిక్‌వర్క్ రేటింగ్ అంచనా వేస్తోంది. గడచిన కొన్ని త్రైమాసికాలుగా...
బ్రిక్‌వర్క్ రేటింగ్ అంచనా
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 7.2-7.3 శాతం మధ్యన ఉండొచ్చని బ్రిక్‌వర్క్ రేటింగ్ అంచనా వేస్తోంది. గడచిన కొన్ని త్రైమాసికాలుగా దేశీయ ఆర్థిక వ్యవస్థ నిలకడగా వృద్ధిని నమోదు చేస్తూ వస్తోందని, రానున్న కాలంలో అదే జోరును కనబరిచే వీలుందని బ్రిక్‌వర్క్ రేటింగ్ సీఈఓ మను సెహగల్, చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కేహెచ్ పట్నాయక్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు, వినియోగం పెరగటంతో పాటు ఇటీవలి జీఎ్‌సటీ సంస్కరణలు, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలు వృద్ధికి చోదక శక్తులుగా నిలవనున్నాయని వారు పేర్కొన్నారు. కాగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5-7 శాతం మధ్యన ఉండే అవకాశం ఉందని పట్నాయక్ తెలిపారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం కూడా వృద్ధి పథంలో పయనిస్తోందని, రానున్న సంవత్సరాల్లో ఏటా 12-13 శాతం వృద్ధితో 2034 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే వీలుందన్నారు.
ఇవీ చదవండి:
అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..