Share News

అప్పులపై యువత అనాసక్తి

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:13 AM

అప్పు చేసి పప్పు కూడు తినొద్దనే సామెతను దేశ యువతరం క్రమంగా వంట పట్టించుకుంటోంది. గతంలోలా ఎడాపెడా అప్పులు చేసి, అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి కొనేందుకు...

అప్పులపై యువత అనాసక్తి

  • తగ్గిన రిటైల్‌ రుణాల వృద్ధిరేటు

  • ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ నివేదిక

ముంబై: అప్పు చేసి పప్పు కూడు తినొద్దనే సామెతను దేశ యువతరం క్రమంగా వంట పట్టించుకుంటోంది. గతంలోలా ఎడాపెడా అప్పులు చేసి, అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి కొనేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. ఉన్న నాలుగు రాళ్లను ఏదోలా పొదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. తప్పనిసరి అది కూడా స్థిర, చరాస్తుల కల్పనకు తప్ప అప్పులు చేసేందుకు ఇష్టపడడం లేదు. జేబులో రెండు మూడు క్రెడిట్‌ కార్డులున్నా ‘పొదుపు’ మంత్రం పాటిస్తున్నారు. దీంతో 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 12 శాతంగా ఉన్న రిటైల్‌ రుణాల వృద్ధిరేటు 2024-25 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఐదు శాతానికి పడిపోయినట్టు ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ ఒక నివేదికలో వెల్లడించింది. కన్స్యూమర్‌ డ్యూరబుల్‌ రుణాలు, క్రెడిట్‌ కార్డు రుణాలు తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణం. యువత ముఖ్యంగా పట్టణ, మెట్రో నగరాల్లో ఉంటున్న 35 ఏళ్ల లోపు వయస్కులు అప్పులు చేసేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. ఎగవేతల భయం ఎక్కువగా ఉండే హామీలేని రుణాలపై 2023 చివర్లో ఆర్‌బీఐ విధించిన ఆంక్షలు కూడా ఇందుకు కారణమని ట్రాన్స్‌యూనియల్‌ సిబిల్‌ తెలిపింది.


నివేదిక ఇతర ప్రధాన అంశాలు

  • జీరో నుంచి మైనస్‌ 32 శాతానికి పడిపోయిన క్రెడిట్‌ కార్డు రుణాల వృద్ధిరేటు.

  • 13 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గిన పర్సనల్‌ రుణాల వృద్ధి.

  • 19 నుంచి ఆరు శాతానికి తగ్గిన కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ రుణాల వృద్ధిరేటు.

  • 15 నుంచి ఎనిమిది శాతానికి తగ్గిన క్రెడిట్‌ యాక్టివ్‌ వినియోగదారులు.

  • కొత్తగా రుణాలు తీసుకునే వారి వృద్ధిరేటు 19 నుంచి 16 శాతానికి తగ్గుదల.

  • ఐదు నుంచి మైనస్‌ ఏడు శాతానికి పడిపోయిన గృహ రుణాల వృద్ధిరేటు.

  • తొమ్మిది శాతం పెరిగిన రూ.కోటికిపైగా రుణాలు.

  • 20 నుంచి 22 శాతానికి పెరిగిన గ్రామీణ రుణాలు.

  • 29 నుంచి 30 శాతానికి పెరిగిన సెమీ అర్బన్‌ ప్రాంత రుణాలు.

ఇవీ చదవండి:

ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. ముడి చమురు ధరలకు రెక్కలు

సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 24 , 2025 | 04:13 AM