Stock Market: ఆద్యంతం ఊగిసలాటలే... సూచీలు అక్కడక్కడే..
ABN , Publish Date - Jul 08 , 2025 | 04:02 AM
భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం పరిమిత శ్రేణిలోనే కదలాడినప్పటికీ, ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాటలకు లోనయ్యాయి.
ముంబై: భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం పరిమిత శ్రేణిలోనే కదలాడినప్పటికీ, ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాటలకు లోనయ్యాయి. సెన్సెక్స్ చివరికి 9.61 పాయింట్ల అతి స్వల్ప లాభంతో 83,442.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఏమార్పు లేకుండా 25,461.30 వద్ద ముగిసింది. భారత ఎగుమతులపై అమెరికా ప్రకటించిన అదనపు సుంకాలు ఈ నెల 9 నుంచి అమలులోకి రానున్నాయి. పైగా, అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాకపోవడంతో మార్కెట్ మదుపరులు కొత్త పెట్టుబడుల విషయంలో వేచి చూసే ధోరణిని కనబరిచారు. ఆసియా మార్కెట్లో బలహీన ట్రెండ్, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు మళ్లీ తరలిపోతుండటం వంటి అంశాలూ మన సూచీలపై ఒత్తిడి పెంచాయని ఈక్విటీ విశ్లేషకులు పేర్కొన్నారు. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 12 మాత్రమే రాణించాయి.