Stock Market: చివరి రోజు భారీ లాభాలు.. 500 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్..
ABN , Publish Date - Dec 31 , 2025 | 03:55 PM
స్టీల్ స్టాక్స్ భారీ లాభాలను అందుకోవడం సూచీలకు కలిసొచ్చింది. అలాగే క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం, కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు మార్కెట్లను ముందుకు నడిపాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో రోజును ముగించాయి.
గత నాలుగు సెషన్లుగా నష్టాలతోనే పయనం సాగించిన దేశీయ సూచీలు బుధవారం మాత్రం లాభాల జోరు అందుకుని 2025 సంవత్సరానికి శుభం పలికాయి. ముఖ్యంగా స్టీల్ స్టాక్స్ భారీ లాభాలను అందుకోవడం సూచీలకు కలిసొచ్చింది. అలాగే క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం, కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు మార్కెట్లను ముందుకు నడిపాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో రోజును ముగించాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (84, 675)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం 100 పాయిట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజుంతా అదే జోష్‌ను కొనసాగించింది. మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు మరింత పెరిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 750 పాయింట్లకు పైగా లాభపడి 85, 437 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 545 పాయింట్ల లాభంతో 85, 220 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 190 పాయింట్ల లాభంతో 26, 129 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్‌లో హిందుస్థాన్ పెట్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెయిల్, బీపీసీఎల్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). వోడాఫోన్ ఐడియా, హిందుస్థాన్ జింక్, పీబీ ఫిన్‌టెక్, టీసీఎస్, కెఫిన్ టెక్నాలజీస్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 410 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 570 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.87గా ఉంది.
ఇవి కూడా చదవండి..
బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు సలాం చెప్పాల్సిందే.. పెళ్లి వేదిక దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో నాలుగో పిల్లిని 7 సెకెన్లలో కనిపెట్టండి..