Indian Stock Market: నాలుగో రోజూ నష్టాల్లోనే
ABN , Publish Date - Dec 19 , 2025 | 03:02 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో పయనించాయి. గురువారం ట్రేడింగ్‌లో 540 పాయింట్లకు పైగా...
సెన్సెక్స్ మరో 78 పాయింట్లు డౌన్
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో పయనించాయి. గురువారం ట్రేడింగ్‌లో 540 పాయింట్లకు పైగా శ్రేణిలో ఊగిసలాడిన సెన్సెక్స్.. చివరికి 77.84 పాయింట్ల నష్టంతో 84,481.81 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 3 పాయింట్లు కోల్పోయి 25,815.55 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన ట్రెండ్‌తో పాటు అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంలో జాప్యం ఇందుకు ప్రధాన కారణమయ్యాయి. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 17 నష్టపోగా.. సన్‌ఫార్మా షేరు 2.77 శాతం క్షీణించింది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు పెరిగి రూ.90.20 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ బలపడినప్పటికీ, ఆర్‌బీఐ జోక్యంతో రూపాయికి మద్దతు లభించింది.
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?
For More Latest News