Indian Rupee Surges: రూపీ హైజంప్
ABN , Publish Date - Dec 20 , 2025 | 03:59 AM
భారత కరెన్సీ భారీగా పుంజుకోవడంతో డాలర్ రేటు రూ.90 దిగువకు జారుకుంది. శుక్రవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో...
53 పైసలు బలపడిన రూపీ
న్యూఢిల్లీ: భారత కరెన్సీ భారీగా పుంజుకోవడంతో డాలర్ రేటు రూ.90 దిగువకు జారుకుంది. శుక్రవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక దశలో 95పైసలు బలపడి రూ.89.25 వద్దకు దిగివచ్చింది. చివరికి 53 పైసల లాభంతో రూ.89.67 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు ముడిచమురు ధర 60 డాలర్ల దిగువకు జారుకోవడం, మార్కెట్లు లాభాల్లో పయనించడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడుల రాక రూపాయికి మద్దతుగా నిలిచాయని ఫారెక్స్ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి:
రూపాయి పతనంపై దిగులొద్దు: సంజీవ్ సన్యాల్