Indian Rupee 2025: కొత్త కనిష్ఠానికి రూపాయి
ABN , Publish Date - Dec 16 , 2025 | 06:27 AM
మన రూపాయి మరింత పతనమైంది. అమెరికన్ డాలర్‌తో భారత కరెన్సీ మారకం విలువ సోమవారం ఒక దశలో 31 పైసలు క్షీణించి రూ.90.80 వద్ద ఆల్‌టైమ్ ఇంట్రాడే కనిష్ఠాన్ని...
మరో 29 పైసలు పతనం
రూ.90.78 వద్ద ముగింపు
ముంబై: మన రూపాయి మరింత పతనమైంది. అమెరికన్ డాలర్‌తో భారత కరెన్సీ మారకం విలువ సోమవారం ఒక దశలో 31 పైసలు క్షీణించి రూ.90.80 వద్ద ఆల్‌టైమ్ ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 29 పైసల నష్టంతో రూ.90.78 వద్ద ముగిసింది. ఇది సరికొత్త కనిష్ఠ ముగింపు కూడా. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం జాప్యమవుతుండటం, మన ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలిపోతుండటం, దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరుగుతున్న డిమాండ్ ఇందుకు ప్రధాన కారణమని ఫారెక్స్ వర్గాలు తెలిపాయి. గత నెలకు వాణిజ్య లోటు (ఎగుమతుల ఆదాయం- దిగుమతుల వ్యయం మధ్య అంతరం) అంచనాల కంటే తగ్గినప్పటికీ రూపాయికి మద్దతు లభించలేదని హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ అన్నారు. దాంతో మన రూపాయి మరో కొత్త కనిష్ఠానికి జారుకోవడంతో పాటు ఈ ఏడాది ఆసియాలో అత్యధికంగా క్షీణించిన కరెన్సీగా మిగిలిందన్నారు. మున్ముందు సెషన్లలోనూ రూపాయిపై ఒత్తిడి కొనసాగే అవకాశాలున్నాయని, మారకం రేటుకు రూ.90.95 వద్ద నిరోధం, రూ.90.50 వద్ద మద్దతు లభించవచ్చన్నారు.
ఇవీ చదవండి:
అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..