India Exports Growth: జూలై ఎగుమతుల్లో 7 శాతం వృద్ధి
ABN , Publish Date - Aug 15 , 2025 | 02:16 AM
ఎగుమతుల రంగం రెండు నెలల క్షీణతకు స్వస్తి పలికింది. జూలైలో ఎగుమతులు 7.29 శాతం వృద్ధితో 3,724 కోట్ల డాలర్లుగా (రూ.3.24 లక్షల కోట్లు) నమోదయ్యాయి. ఇంజనీరింగ్, ఎలక్ర్టానిక్స్...
న్యూఢిల్లీ: ఎగుమతుల రంగం రెండు నెలల క్షీణతకు స్వస్తి పలికింది. జూలైలో ఎగుమతులు 7.29 శాతం వృద్ధితో 3,724 కోట్ల డాలర్లుగా (రూ.3.24 లక్షల కోట్లు) నమోదయ్యాయి. ఇంజనీరింగ్, ఎలక్ర్టానిక్స్, వజ్రాభరణాలు, ఫార్మా, కెమికల్స్ రంగాలు ఈ వృద్ధికి ఊతం ఇచ్చాయి. అదే సమయంలో వాణిజ్య లోటు మాత్రం 8 నెలల గరిష్ఠ స్థాయి 2,735 కోట్ల డాలర్లకు (రూ.2.38 లక్షల కోట్లు) దూసుకుపోయింది. గత ఏడాది నవంబరులో నమోదైన వాణిజ్య లోటు 3,177 కోట్ల డాలర్ల (రూ.2.76 లక్షల కోట్లు) తర్వాత నమోదైన గరిష్ఠ స్థాయి ఇదే. గురువారం వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దిగుమతులు 8.6ు వృద్ధితో 6,459 కోట్ల డాలర్లకు (రూ.5.62 లక్షల కోట్లు) చేరాయి.
అమెరికాతో వాణిజ్యం అప్
ట్రంప్ సుంకాల నేపథ్యంలోనూ భారత్-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతోంది. జూలైలో మన దేశం అమెరికాకు 801 కోట్ల డాలర్ల విలువైన సరుకులు ఎగుమతి చేసి,..ఆ దేశం నుంచి 455 కోట్ల డాలర్ల విలువైన సరుకులు దిగుమతి చేసుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే జూలైలో భారత ఎగుమతులు 19.94 శాతం పెరగగా, దిగుమతులు 13.78 శాతం పెరిగాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనూ అమెరికాకు మన ఎగుమతులు 21.64 శాతం పెరిగి 3,353 కోట్ల డాలర్లకు చేరాయి. ఆ దేశం నుచి మన దేశానికి వచ్చే దిగుమతులూ 12.33 శాతం పెరిగి 1,741 కోట్ల డాలర్లకు చేరాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ
For More AndhraPradesh News And Telugu News