Share News

Global Expo: 2027 ఫిబ్రవరిలో భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:33 AM

భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో (బీఏంజీఈ).. తదుపరి ఎడిషన్‌ను 2027, ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు ఢిల్లీలో...

Global Expo: 2027 ఫిబ్రవరిలో భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో

న్యూఢిల్లీ: భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో (బీఏంజీఈ).. తదుపరి ఎడిషన్‌ను 2027, ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు ఢిల్లీలో నిర్వహించనున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఇప్పటికే 2024, 2025 (జనవరి)లో జరిగిన రెండు ఎడిషన్స్‌కు విశేష స్పందన లభించగా.. ఈ మూడో ఎడిషన్‌లో ఎక్స్‌పో పరిధిని మరింత విస్తరించేందుకు కొత్త విభాగాలను చేర్చనున్నట్లు వెల్లడించింది. వీటిలో మల్టీ మోడల్‌ మొబిలిటీ, లాజిస్టిక్స్‌తో పాటు వ్యవసాయ ఆధారిత మొబిలిటీ పరిష్కారాలపై ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

చమురు తీసుకుంటే భారత్‎పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్

రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 04 , 2025 | 04:33 AM