Share News

మొబైల్‌ కాంగ్రెస్‌లో 6జీ అభివృద్ధిపై చర్చలు

ABN , Publish Date - Oct 05 , 2025 | 04:58 AM

ప్రపంచ టెలికాం రంగంలో, భారత్‌ తన సాంకేతిక ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 8 నుంచి 11 వరకు ఢిల్లీలో జరుగనున్న ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎమ్‌సీ)-2025 ఈ దిశగా...

మొబైల్‌ కాంగ్రెస్‌లో 6జీ అభివృద్ధిపై చర్చలు

ఐఎమ్‌సీ సీఈఓ పి. రామకృష్ణ

న్యూఢిల్లీ: ప్రపంచ టెలికాం రంగంలో, భారత్‌ తన సాంకేతిక ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 8 నుంచి 11 వరకు ఢిల్లీలో జరుగనున్న ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎమ్‌సీ)-2025 ఈ దిశగా కీలకమైన వేదికగా నిలవనుంద ని ఐఎమ్‌సీ సీఈఓ పి.రామకృష్ణ అన్నారు. ఈ సంవత్సరం ఐఎమ్‌సీ.. 6జీ ఎకోసిస్టమ్‌ అభివృద్ధి, భాగస్వామ్యాల విస్తరణ, సాంకేతిక సహకారం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. భారత్‌తో పాటు యూకే, అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాల సీనియర్‌ పరిశ్రమ నాయకులు, ప్రొఫెసర్లు, నిపుణులు ఈ సదస్సుకు హాజరవుతారని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్‌ సీఎం

PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ

Updated Date - Oct 05 , 2025 | 04:58 AM