Share News

Salary Hike India 2026: వచ్చే ఏడాది జీతాల్లో 9% వృద్ధి

ABN , Publish Date - Dec 18 , 2025 | 06:46 AM

వచ్చే ఏడాది దేశంలో ఉద్యోగుల జీతాల్లో సగటు వృద్ధి 9 శాతం ఉండవచ్చునంటున్నారు. అయితే స్వల్పకాలిక ప్రోత్సాహకాలు, నైపుణ్య ఆధారిత విధానాలపై కంపెనీలు మరోసారి...

Salary Hike India 2026: వచ్చే ఏడాది జీతాల్లో 9% వృద్ధి

మెర్సర్‌ సర్వే నివేదిక

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది దేశంలో ఉద్యోగుల జీతాల్లో సగటు వృద్ధి 9 శాతం ఉండవచ్చునంటున్నారు. అయితే స్వల్పకాలిక ప్రోత్సాహకాలు, నైపుణ్య ఆధారిత విధానాలపై కంపెనీలు మరోసారి దృష్టి సారించవచ్చునని ఒక అధ్యయనంలో తేలింది. మెర్సర్‌ కంపెనీ టోట ల్‌ రెమ్యూనిరేషన్‌ సర్వే 2026 పేరిట నిర్వహించిన అధ్యయనంలో పలువురు ఈ అభిప్రాయాలు ప్రకటించారు. వ్యక్తిగత పనితీరు, ద్రవ్యోల్బణ ధోరణు లు, ఉద్యోగాల మార్కెట్లో సంస్థల పోటీ సామర్థ్యం వంటి అంశాలు వేతనాల పెంపును ప్రభావితం చేస్తున్నాయని ఆ సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. దేశంలోని చాలా కంపెనీలు వ్యయ ఒత్తిడులను సమతూకం చేసుకుంటూ ప్రతిభావంతులు తరలిపోకుండా కాపాడుకుంటూ వేతనాల పెంపును అమలుపరచవచ్చునని తమ సర్వేలో తే లిందని మెర్సర్‌ రివార్డ్స్‌ కన్సల్టింగ్‌ లీడర్‌ (ఇండియా) మాలతి కెఎస్‌ అన్నారు.

ముఖ్యాంశాలు...

  • రంగాలవారీగా పరిశీలించినట్టయితే వేతన వృద్ధి ఆటోమోటివ్‌ రంగంలో అత్యధికంగా 9.5% ఉండవచ్చు. 9.3 శాతంతో హైటెక్‌ (ఉత్పత్తులు, కన్సల్టింగ్‌) తర్వాతి స్థానంలో నిలువవచ్చు.

  • ఐటీ, ఐటీఈఎస్‌, జీసీసీలు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నవ్య, ప్రగతిశీలక ప్రయోజనాలు ఉద్యోగులకు అందించే ఆస్కారం ఉంది.

  • భారత్‌ డిజిటల్‌ పరివర్తన బాటలో నడుస్తున్న నేపథ్యంలో కంపెనీలు ఉత్పాదకతపై ఫోకస్‌ పెంచవచ్చు. వ్యయ నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంక్రిమెంట్లు పొందే అర్హత ఎంత మం దికి ఉంది అని మదింపు చేసే ఆస్కారం ఉంది.

ఇవీ చదవండి:

జీవితకాల కనిష్ఠ స్థాయికి చేరిన రూపాయి

యశోద హాస్పిటల్స్‌, ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ పబ్లిక్‌ ఇష్యూలకు సెబీ ఓకే

Updated Date - Dec 18 , 2025 | 06:46 AM