India Crosses One Lakh Petrol Pumps: పెట్రోల్ పంపులు లక్ష
ABN , Publish Date - Dec 26 , 2025 | 04:48 AM
దేశంలో పెట్రోల్ పంపుల సంఖ్య లక్ష దాటింది. వాహన యజమానుల సంఖ్య పెరుగుదలకు దీటుగా ఆయిల్ రిటైలింగ్ కంపెనీలు పెట్రోల్ పంపులను భారీగా విస్తరించుకుంటూ...
అమెరికా, చైనా తర్వాత మూడో స్థానం
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ పంపుల సంఖ్య లక్ష దాటింది. వాహన యజమానుల సంఖ్య పెరుగుదలకు దీటుగా ఆయిల్ రిటైలింగ్ కంపెనీలు పెట్రోల్ పంపులను భారీగా విస్తరించుకుంటూ వచ్చాయి. ఫలితంగా 2015 నుంచి పంపుల సంఖ్య రెట్టింపైంది. అప్పట్లో పంపుల సంఖ్య 50,451గా ఉంది. కాగా ఈ ఏడాది నవంబరు చివరి నాటికి ఈ సంఖ్య ఏకంగా 1,00,266కి పెరిగింది. రిటైలర్లు.. గ్రామీణ, హైవే కారిడార్లపై పంపుల విస్తరణకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో పెట్రోల్ పంపుల సంఖ్యలో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో పెద్ద దేశంగా అవతరించింది. ఆయిల్ మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్, విశ్లేషణ విభాగం గణాంకాలు ఈ విషయాలను వెల్లడించాయి. 90 శాతం ఔట్‌లెట్లు ప్రభుత్వ రంగంలోని ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీల యాజమాన్యంలో ఉన్నాయి. ప్రైవేటు కంపెనీల విషయానికి వస్తే 6,921 ఔట్‌లెట్లతో రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ సంస్థనయారా ఎనర్జీ అగ్రస్థానంలో ఉంది. 2,114 పంపులతో రిలయన్స్-బీపీ, 346 పంపులతో షెల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?
బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..