Share News

India Considers Easing FDI Curbs: చైనా ఎఫ్‌డీఐ కి గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Nov 25 , 2025 | 01:58 AM

చైనా నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై (ఎఫ్‌డీఐ) బెట్టు సడలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యంగా ఎలకా్ట్రనిక్స్‌, కన్స్యూమర్‌ డ్యూరబుల్‌ వస్తువుల విషయంలో కొద్దిగా సడలింపు ఇవ్వాలని

India Considers Easing FDI Curbs: చైనా ఎఫ్‌డీఐ కి  గ్రీన్‌సిగ్నల్‌

సిద్ధమైన కేబినెట్‌ నోట్‌

న్యూఢిల్లీ: చైనా నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై (ఎఫ్‌డీఐ) బెట్టు సడలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యంగా ఎలకా్ట్రనిక్స్‌, కన్స్యూమర్‌ డ్యూరబుల్‌ వస్తువుల విషయంలో కొద్దిగా సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీని కోసం అధికార వర్గాలు ఇప్పటికే కేంద్ర కేబినెట్‌ పరీశీలన కోసం ఒక నోట్‌ కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. 2020లో జరిగిన గల్వాన్‌ సరిహద్దు ఘర్షణ తర్వాత చైనా నుంచి వచ్చే ఎఫ్‌డీఐని ప్రభు త్వం కట్టడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో మన దేశంలోని ఎలకా్ట్రనిక్స్‌, కన్స్యూమర్‌ డ్యూరబుల్‌ వస్తువుల తయారీ కంపెనీలతో పాటు అనేక కంపెనీలు కీలక యంత్రాలు, విడి భాగాలను చైనా నుంచి దిగుమతి చేసుకోలేకపోతున్నాయి. దీని వల్ల మేకిన్‌ ఇండి యా లక్ష్యం కూడా దెబ్బతింటుందని పరిశ్రమ వర్గాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో కొన్ని రంగాల్లో చైనా ఎఫ్‌డీఐని అనుమతించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ కంపెనీల్లో చైనా ఎఫ్‌డీఐని పరిమిత స్థాయిలోనే అనుమతిస్తూ, ఆయా కంపెనీల కీలక ఉద్యోగులు అందరూ భారతీయులే అయి ఉండాలని ప్రభుత్వం షరతులు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

అన్‌క్లెయిమ్డ్‌ బీమా మొత్తాలు క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా

అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 25 , 2025 | 01:58 AM