నిస్సాన్ ఎగుమతుల కేంద్రంగా భారత్
ABN , Publish Date - Feb 03 , 2025 | 06:51 AM
జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్‌కు ప్రపంచంలో ప్రధాన ఎగుమతి కేంద్రా ల్లో ఒకటిగా బ్రిటన్ సరసన భారత్ చేరుతోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ మాగ్నైట్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ (ఎల్‌హెచ్‌డీ) కార్లను...

న్యూఢిల్లీ: జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్‌కు ప్రపంచంలో ప్రధాన ఎగుమతి కేంద్రా ల్లో ఒకటిగా బ్రిటన్ సరసన భారత్ చేరుతోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ మాగ్నైట్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ (ఎల్‌హెచ్‌డీ) కార్లను భారత్ నుంచి కొత్త దేశాలకు ఎగుమతి చేయ డం కంపెనీ ప్రారంభించింది. ప్రస్తుతం 20 దేశాలకు కార్లు ఎగుమతి చేస్తున్న నిస్సాన్ ఇండియా తాజాగా ఆ దేశాల సంఖ్యను 45కి విస్తరించింది. తాము అనుసరిస్తున్న ‘‘ఒక కారు, ఒక ప్రపంచం’’ వ్యూహంలో భాగంగానే మాగ్నైట్ ఎల్‌హెచ్‌డీ ఎగుమతులకు భారత్‌ను కేంద్రంగా చేసుకున్నామని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోరిస్ అన్నారు.
భారత్‌కు గల సామర్థ్యాలకు కూడా ఇది నిదర్శనమని చెప్పారు. ఈ నెలలో పశ్చిమాసియా, ఉత్తర అమెరికా, ఆసి యా పసిఫిక్ దేశాలకు 2,000 యూనిట్లు ఎగుమతి చేయడంతో పాటు మెక్సికో సహా లాటిన్ అమెరికా మార్కెట్లకు 5,100 ఎల్‌హెచ్‌డీ మాగ్నైట్ కార్లు ఎగుమతి చేయాలని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. నిస్సాన్, హోండా కంపెనీలు విలీనం అయినంత మాత్రాన భారత మార్కెట్ కోసం తాము ప్రకటించిన కొత్త ఉత్పత్తుల ప్రణాళికల్లో ఎలాంటి మార్పు ఉండబోదని టోరిస్ స్పష్టం చేశారు.
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News