Share News

Increase Healthcare Budget: హెల్త్‌కేర్‌ బడ్జెట్‌ పెంచాలి సంగీతా రెడ్డి

ABN , Publish Date - Nov 20 , 2025 | 05:57 AM

వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్‌) రంగాకి కేటాయింపులు పెంచాని ఈ రంగానికి ప్రాతినిధ్యం వహించే నాట్‌హెల్త్‌ సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, అపోలో హాస్పిటల్స్‌ జేఎండీ సంగీతా రెడ్డి ప్రభుత్వాన్ని...

Increase Healthcare Budget: హెల్త్‌కేర్‌ బడ్జెట్‌ పెంచాలి సంగీతా రెడ్డి

న్యూఢిల్లీ: వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్‌) రంగాకి కేటాయింపులు పెంచాని ఈ రంగానికి ప్రాతినిధ్యం వహించే నాట్‌హెల్త్‌ సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, అపోలో హాస్పిటల్స్‌ జేఎండీ సంగీతా రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ‘భవిష్యత్‌లో దేశ ఆరోగ్య రంగం బహుముఖ విస్తరణకు ఈ కేటాయింపులు ప్రారంభ వేదికగా మారాలి’ అన్నారు. ఈ కేటాయింపులు ఈ రంగంలో మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సరికొత్త ఆవిష్కరణలకు దోహదం చేసేలా ఉండాలన్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో మన దేశం ఇప్పటికే తన సత్తా నిరూపించుకుందని సంగీతా రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఈ రంగానికి కావలసిందల్లా విస్తరణకు అవసరమైన ఆర్థిక, విధాన పరమైన ప్రోత్సాహకాలు మాత్రమేనన్నారు. ఇందుకోసం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం సైతం అవసరమన్నారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే భవిష్యత్‌ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రపచంలోనే మేలైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మన దేశంలో అభివృద్ధి చేసుకోవచ్చని సంగీతా రెడ్డి సూచించారు.

ఇవీ చదవండి:

హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు

అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ

Updated Date - Nov 20 , 2025 | 05:57 AM