ఐటీ రిటర్నుల గడువు జూలై 31
ABN , Publish Date - May 13 , 2025 | 03:18 AM
మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్నుల ఫైలింగ్ గడువును ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఎప్పటిలా ఈ ఏడాది కూడా జూలై 31గా...
ఏడు రకాల రిటర్న్ ఫారాల విడుదల
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్నుల ఫైలింగ్ గడువును ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఎప్పటిలా ఈ ఏడాది కూడా జూలై 31గా నిర్ణయించింది. అసె్‌సమెంట్ ఇయర్ (ఏవై) 2025-26కు సంబంధించి ఏడు రకాల ఐటీ రిటర్న్ ఫారాలను విడుదల చేసింది.
లిస్టెడ్ కంపెనీల షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో వార్షిక దీర్ఘకాలిక మూలధన లాభాలు (ఎల్‌టీసీజీ) రూ.1.25 లక్షల వరకు ఉన్న చిన్న,మధ్య రకం పన్ను చెల్లింపుదారులు ఇకపై ఎలాంటి పన్ను పోటు లేకుండా ఐటీఆర్-2కు బదులుగా ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫారాల్లో తమ రిటర్నులు దాఖలు చేయాలి.
ఎల్‌టీసీజీ రూ.1.25 లక్షలు మించితే మాత్రం 12.5 శాతం పన్ను చెల్లించాలి.
ట్రస్టులు, ధార్మిక సంస్థలు ఐటీఆర్-7 ద్వారా తమ రిటర్న్‌లు ఫైల్ చేయాలి.
ఐటీఆర్-2,3,5,6,7 ఫారాల్లో పేర్కొనే మూలధన లాభాలను హేతుబద్దం చేశారు. ఇండెక్సేషన్ ప్రయోజనం కావాలనుకుంటే 20 శాతం, వద్దనుకుంటే 12.5 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
ఇవి కూడా చదవండి
Paytm: పేటీఎంకు మరో దెబ్బ..సంస్థలో 4 శాతం వాటా సేల్ చేస్తున్నారా..
Penny Stock: ఈ స్టాక్‌పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..
Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి