టాప్ గేర్‌లో మారుతి క్యూ3లో రూ.3,727 కోట్ల నికర లాభం
ABN , Publish Date - Jan 30 , 2025 | 02:23 AM
మారుతి సుజుకీ సంస్థ వర్తమాన ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికానికి మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి కంపెనీ రూ.38,764 కోట్ల కన్సాలిడేటెడ్...

న్యూఢిల్లీ: మారుతి సుజుకీ సంస్థ వర్తమాన ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికానికి మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి కంపెనీ రూ.38,764 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.3,727 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఆదా యం, నికర లాభం 16 శాతం చొప్పున పెరిగాయి. ఏకీకృత (స్టాండ్ అలోన్) ప్రాతిపదికన క్యు3లో కంపెనీ ఆదాయం గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.31,860 కోట్ల నుంచి రూ.36,802 కోట్లకు చేరింది. నికర లాభం రూ.3,130 కోట్ల నుంచి రూ.3,525 కోట్లకు చేరింది.
తొమ్మిది నెలలకు: డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో మారుతి నికర అమ్మకాలు రూ.98,240 కోట్ల నుంచి రూ.1,06,266 కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.9,331 కోట్ల నుంచి రూ.10,244 కోట్లకు చేరింది.
వాహన అమ్మకాలూ అదుర్స్ : డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ 5,66,213 వాహనాలు విక్రయించింది. 2023 డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. ఇందులో 4,66,993 వాహనాలను దేశీయ మార్కెట్‌లో, 99,220 వాహనాలను విదేశీ మార్కెట్ల విక్రయించింది. గతంలో ఏ ఒక్క త్రైమాసికంలోనూ కంపెనీ ఇన్ని వాహనాలను ఎగుమతి చేయలేదు. డిసెంబరు, 24తో ముగిసిన తొమ్మిది నెలలను పరిగణనలోకి తీసుకున్నా కంపెనీ వాహన అమ్మకాలు, డిసెంబరు, 23తో పోలిస్తే ఐదు శాతం వృద్ధితో 16,29,631 యూనిట్లకు చేరాయి. మళ్లీ ఇందులో 13,82,135 వాహనాలను దేశీయ మార్కెట్‌లో, 2,47,496 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది.
మళ్లీ టకెయుచీనే ఎండీ, సీఈఓ
హిసాషి టకెయుచిని మరో మూడేళ్ల పాటు కంపెనీ ఎండీ, సీఈఓగా నియమించేందుకు బుధవారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది. సుజుకీ మోటార్ గుజరాత్ కంపెనీని మారుతి సుజుకీ ఇండియాలో విలీనం చేసే తీర్మానానికి కూడా ఆమోదం తెలిపింది.
ఇవి కూడా చదవండి:
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Read More Business News and Latest Telugu News