GST November Deadline: ఈ నెలాఖరులోపు చేయాల్సిన పనులేమిటంటే
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:04 AM
జీఎ్‌సటీ కింద నమోదైన వ్యాపారస్తులకు నవంబరు నెల చాలా ముఖ్యమైనది. గత ఆర్థిక సంవత్సరాని (2024-25)కి సంబంధించి ఏవైనా సర్దుబాట్లు చేయాలన్నా, గత ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన రిటర్నుల్లో...
జీఎ్‌సటీ కింద నమోదైన వ్యాపారస్తులకు నవంబరు నెల చాలా ముఖ్యమైనది. గత ఆర్థిక సంవత్సరాని (2024-25)కి సంబంధించి ఏవైనా సర్దుబాట్లు చేయాలన్నా, గత ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన రిటర్నుల్లో జరిగిన పొరపాట్లు సరిదిద్దాలన్నా ఈ నెలాఖరులోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన ముఖ్య విషయాలు మీకోసం.
ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్..
జీఎ్‌సటీలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అనేది ఒక నిర్దిష్ఠ గడువులోపు తీసుకోవాలనే నిబంధన ఒకటి ఉంది. ఐటీసీ నియమ నిబంధనల ప్రకారం ఇన్వాయిస్ లేదా డెబిట్ నోట్ ఏ ఆర్థిక సంవత్సరంలో తీసుకుంటారో.. సంబంధిత ఐటీసీని తదుపరి సంవత్సరం నవంబరు 30 లోపు తీసుకోవాలి. అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో పొందిన ఇన్వాయి్‌సలు లేదా డెబిట్ నోట్స్‌కు సంబంధించి ఏదైనా ఐటీసీ తీసుకోకుండా మిగిలి ఉంటే ఆ మొత్తాన్ని ఈ నవంబరు 30లోపు తీసుకోవాలి. కాబట్టి వ్యాపారస్తులు తాము గత ఆర్థిక సంవత్సరంలో పొందిన ఇన్వాయి్‌సలను జాగ్రత్తగా గమనించి అర్హత ఉండి తీసుకోని ఐటీసీ ఏమైనా మిగిలి ఉంటే ఆ మొత్తాన్ని ఈ నెలాఖరు లోపు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే జీఎ్‌సటీఆర్ -3బీ రిటర్న్ దాఖలు చేయకుండా ఐటీసీని తీసుకోలేరు. కాబట్టి నవంబరు 30వ తేదీని తుది గడువుగా దృష్టిలో పెట్టుకుని జీఎ్‌సటీఆర్-3బీ రిటర్న్ దాఖలు చేయటం ద్వారా మిగిలిపోయిన ఐటీసీని తీసుకోవచ్చు.
క్రెడిట్ నోట్..
అలాగే గత ఆర్థిక సంవత్సరంలో జరిపిన సరఫరాలకు సంబంధించి ఏదైనా క్రెడిట్ నోట్ జారీ చేసినట్లయితే సంబంధిత క్రెడిట్ నోట్ విలువను తదుపరి సరఫరాలలో తగ్గించుకోవటానికి తుది గడువు నవంబరు 30. కాబట్టి ఏదేనీ క్రెడిట్ నోట్‌కు సంబంధించిన విలువను తగ్గించకుంటే సంబంధిత రిటర్న్ దాఖలు చేయటం ద్వారా నవంబరు 30 లోపు క్రెడిట్ నోట్ విలువను సర్దుబాటు చేసుకోవటం ద్వారా ఇంతకు ముందు ఎక్కువ కట్టిన ట్యాక్స్‌ను తగ్గించుకోవచ్చు.
జీఎ్‌సటీఆర్-1 రిటర్న్‌లో పొరపాట్లు ఉన్నా..
ఒక నెలలో జరిపిన సరఫరాల వివరాలను జీఎ్‌సటీఆర్-1 రిటర్న్‌లో చూపాలన్న విషయం తెలిసిందే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన జీఎ్‌సటీఆర్-1 రిటర్నుల్లో చూపాల్సిన వివరాల్లో ఏవైనా పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లు సరిదిద్దుకోవటానికి కూడా గడువు తేదీ నవంబరు 30. ఇంకా జీఎ్‌సటీఆర్-3బీ రిటర్న్‌తో పాటుగా మరికొన్ని రిటర్నులకు సంబంధించిన పొరపాట్లకు సంబంధించిన సవరణలకు గడువు తేదీ కూడా ఈ నెల 30నే.
ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. పైన చెప్పిన ప్రతి అంశానికి సంబంధిత నియమ నిబంధనలు వర్తిస్తాయి. అంతేకాకుండా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రిటర్న్ ఒకవేళ నవంబరు 30 కంటే ముందే దాఖలు చేస్తే పైన చెప్పిన అన్ని సందర్భాలకు నవంబరు 30కి బదులుగా వార్షిక రిటర్న్ దాఖలు చేసిన తేదీనే గడువు తేదీగా తీసుకోవాల్సి ఉంటుంది.
ఎలకా్ట్రనిక్ క్రెడిట్ రివర్సల్
ఈ నెలాఖరు లోపు చేయాల్సిన మరొక ముఖ్యమైన పని, ఇంతకు ముందు రివర్స్ చేసి తిరిగి క్లెయిమ్ చేయటానికి అర్హత ఉన్న ఐటీసీ బ్యాలెన్స్‌ను ‘ఎలకా్ట్రనిక్ క్రెడిట్ రివర్సల్ అండ్ రీ-క్లెయిమ్డ్ స్టేట్‌మెంట్’ లో చూపటం. ఈ నెలాఖరు లోపు ఈ పని చేయని వారు బ్యాలెన్స్ క్రెడిట్‌ను కోల్పోతారు. కాబట్టి అందరు తమ ఖాతాలను జాగ్రత్తగా చూసుకోవాలి. వివరంగా చెప్పాలంటే.. జీఎ్‌సటీకి సంబంధించి నవంబరు నెల చాలా ముఖ్యమైనది. కాబట్టి వ్యాపారస్తులు తమ ఆడిటర్లతో క్షుణ్ణంగా చర్చించి గత ఆర్థిక సంవత్సర లావాదేవీలకు సంబంధించి ఎలాంటి పెండిగ్‌లు లేకుండా చూసుకోవాలి.
గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
రాంబాబు గొండాల
ఇవి కూడా చదవండి:
అమెరికాలో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోతలు.. సంచలన నివేదికలో వెల్లడి
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి