ఐఎంఎఫ్ ఈడీ కేవీ సుబ్రమణియన్‌పై వేటు
ABN , Publish Date - May 05 , 2025 | 05:42 AM
పాకిస్థాన్‌పై ఆర్థిక యుద్ధాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత తీవ్రం చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎ్‌ఫ)లో మన దేశం తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా ఉన్న కేవీ సుబ్రమణియన్‌ను...
పాక్‌పై ఆర్థిక యుద్ధం మరింత తీవ్రం చేసేందుకే..
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌పై ఆర్థిక యుద్ధాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత తీవ్రం చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎ్‌ఫ)లో మన దేశం తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా ఉన్న కేవీ సుబ్రమణియన్‌ను కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా తొలగించింది. ఆయన పదవీ కాలం ఇంకా ఆరు నెలలు ఉండగానే ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది. వాస్తవానికి సుబ్రమణియన్ పదవీ కాలం ఈ ఏడాది అక్టోబరుతో ముగియా ల్సి ఉంది. అయితే ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ నెల ఒకటో తేదీ నుంచే సుబ్రమణియన్‌కు ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. ఇందుకు కారణాలు మాత్రం వెల్లడించలేదు.
పాక్‌పై ఒత్తిడి పెంచేందుకే: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. ఐఎంఎఫ్ విషయ సేకరణపై సుబ్రమణియన్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఆ సంస్థలోని చాలా దేశాలకు రుచించలేదు. దీనికి తోడు ఇటీవల ఆయన తన తాజా పుస్తకం ‘ఇండియా ః 100: ఎన్‌విజనింగ్ టుమారోస్ ఎకనామిక్ ప్రమోషన్’ ప్రమోషన్ కోసం చేసిన ప్రచారం ఆయన స్థాయికి తగ్గట్టు లేదని ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఈ నెల 9న జరిగే ఐఎంఎఫ్ సమావేశంలో పాకిస్థాన్‌కు కొత్త రుణాలు పుట్టకుండా మిగతా దేశాల మద్దతు కూడగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని భావిస్తున్నారు. ఈ సమావేశంలో పాక్‌కు మరో విడత 130 కోట్ల డాలర్ల రుణం మంజూరు చేయడంతో పాటు ఇప్పటికే మంజూరు చేసిన రుణాల వినియోగాన్ని ఐఎంఎఫ్ సమీక్షించనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆకస్మికంగా సుబ్రమణియన్‌ను ఐఎంఎఫ్ ఈడీ పదవి నుంచి తొలగించాలని నిర్ణయించడం విశేషం.
ఇవి కూడా చదవండి:
పెరిగిన ఏటీఎమ్ విత్‌డ్రా చార్జీలు.. నేటి నుంచి కొత్త రూల్స్
ఇప్పటికీ జనాల వద్ద రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా అప్‌డేట్ ఏంటంటే..
వాణిజ్యాన్ని ఆయుధంగా వాడొద్దన్న వారెన్ బఫెట్
Read More Business News and Latest Telugu News