Share News

IdeaForge Technology: భారత ఆర్మీ నుంచి ఐడియా ఫోర్జ్‌కు రూ 100 కోట్ల ఆర్డర్లు

ABN , Publish Date - Nov 16 , 2025 | 04:13 AM

భారత సైన్యం నుంచి రూ.100 కోట్లకు పైగా విలువైన ఆర్డర్లు దక్కించు కున్నట్లు డ్రోన్ల తయారీ సంస్థ ఐడియాఫోర్జ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ వెల్లడించింది...

IdeaForge Technology: భారత ఆర్మీ నుంచి ఐడియా ఫోర్జ్‌కు రూ 100 కోట్ల ఆర్డర్లు

ముంబై: భారత సైన్యం నుంచి రూ.100 కోట్లకు పైగా విలువైన ఆర్డర్లు దక్కించు కున్నట్లు డ్రోన్ల తయారీ సంస్థ ఐడియాఫోర్జ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ వెల్లడించింది. తమ కొత్త ఉత్పత్తులైన టాక్టికల్‌ యూఏవీ (అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికిల్‌) ‘జోల్‌’్టకు రూ.75 కోట్లు, ఆల్‌ టెర్రెయిన్‌ వీటోల్‌ డ్రోన్‌ ‘స్విచ్‌ వీ2’కు రూ.30 కోట్ల ఆర్డర్లు దక్కాయని సంస్థ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన ఏరో ఇండియాలో కంపెనీ ఈ రెండు అత్యాధునిక డ్రోన్లను విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి:

అమెరికాలో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోతలు.. సంచలన నివేదికలో వెల్లడి

ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 16 , 2025 | 04:13 AM