Share News

ICL Fincorp NCD: ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌ రూ 100 కోట్ల ఎన్‌సీడీ ఇష్యూ

ABN , Publish Date - Nov 16 , 2025 | 04:15 AM

ఎన్‌బీఎ్‌ఫసీ సంస్థ ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌.. సెక్యూర్డ్‌ రిడీమబల్‌ నాన్‌ కన్వర్టబల్‌ డిబెంచర్ల (ఎన్‌సీడీ) జారీ ద్వారా రూ.100 కోట్ల సమీకరించనున్నట్లు...

ICL Fincorp NCD: ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌ రూ 100 కోట్ల ఎన్‌సీడీ ఇష్యూ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎన్‌బీఎ్‌ఫసీ సంస్థ ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌.. సెక్యూర్డ్‌ రిడీమబల్‌ నాన్‌ కన్వర్టబల్‌ డిబెంచర్ల (ఎన్‌సీడీ) జారీ ద్వారా రూ.100 కోట్ల సమీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ ఎన్‌సీడీ ఇష్యూ ఈ నెల 17న ప్రారంభమై 28న ముగియనుందని సంస్థ సీఎండీ కేజీ అనిల్‌ కుమార్‌ వెల్లడించారు. క్రిసిల్‌ బీబీబీ మైనస్‌ రేటింగ్‌ కలిగిన ఈ ఎన్‌సీడీ ఇష్యూ 13,24,36,60,70 నెలల కాలపరిమితులతో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఒక్కో ఎన్‌సీడీని రూ.1,000 ముఖ విలువతో జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. 10.50 శాతం నుంచి 12.62 శాతం వడ్డీ రేటును ఈ ఎన్‌సీడీలకు ఐసీఎల్‌ ఆఫర్‌ చేస్తోంది. ఈ ఇష్యూ బేస్‌ పరిమాణం రూ.50 కోట్లుగా ఉండగా గ్రీన్‌ షూ ఆప్షన్‌ కింద మరో రూ.50 కోట్లు సమీకరించనుంది. సంస్థ సేవల విస్తరణతో పాటు వృద్ధికి ఎన్‌సీడీ ద్వారా సమీకరించిన మొత్తాలను వినియోగించనున్నట్లు ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

అమెరికాలో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోతలు.. సంచలన నివేదికలో వెల్లడి

ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 16 , 2025 | 04:15 AM