Share News

హెచ్‌డీఎ్‌ఫసీపై ఐసీఐసీఐ కన్నేసింది

ABN , Publish Date - Jun 22 , 2025 | 04:42 AM

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగంలో హెచ్‌డీఎ్‌ఫసీ, ఐసీఐసీఐ దిగ్గజ బ్రాండ్లు. గతంలో ఈ రెండింటి విలీనానికి ప్రయత్నాలు జరిగాయి. హెచ్‌డీఎ్‌ఫసీ లిమిటెడ్‌ను టేకోవర్‌ చేసేందుకు ఐసీఐసీఐ...

హెచ్‌డీఎ్‌ఫసీపై ఐసీఐసీఐ కన్నేసింది

  • కొనుగోలుకు చందా కొచ్చర్‌ హయాంలో ఆఫర్‌

  • కొచ్చర్‌తో ఇంటర్వ్యూలో వెల్లడించిన దీపక్‌ పరేఖ్‌

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగంలో హెచ్‌డీఎ్‌ఫసీ, ఐసీఐసీఐ దిగ్గజ బ్రాండ్లు. గతంలో ఈ రెండింటి విలీనానికి ప్రయత్నాలు జరిగాయి. హెచ్‌డీఎ్‌ఫసీ లిమిటెడ్‌ను టేకోవర్‌ చేసేందుకు ఐసీఐసీఐ ప్రయత్నించిందట. ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈఓ, ఎండీ చందా కొచ్చర్‌ తనతో ఆ ప్రతిపాదన చేశారని, కానీ తాను తిరస్కరించానని హెచ్‌డీఎ్‌ఫసీ లిమిటెడ్‌ మాజీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ వెల్లడించారు. చందా కొచ్చర్‌ ఈ మధ్యనే ప్రారంభించిన యూట్యూబ్‌ చానల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా పరేఖ్‌ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘‘నాకింకా గుర్తుంది. గతంలో మీరు నాతో మాట్లాడుతూ.. హెచ్‌డీఎ్‌ఫసీని ఐసీఐసీఐనే ప్రారంభించింది. మీరు తిరిగి మా గూటికి ఎందుకు చేరకూడదు? అంటూ టేకోవర్‌ ఆఫర్‌ చేశారు’’ అని కొచ్చర్‌కు పరేఖ్‌ గుర్తు చేశారు. కానీ అది సహేతుకం, సముచితం కాదని ఆఫర్‌ను తిరస్కరించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సంస్థ హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ మాతృ సంస్థే హెచ్‌డీఎ్‌ఫసీ లిమిటెడ్‌. ఆర్‌బీఐ ప్రోద్భలంతో మాతృసంస్థ అయిన హెచ్‌డీఎ్‌ఫసీ లిమిటెడ్‌ను అనుబంధ విభాగమైన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌లో విలీనం చేశారు. 2023 జూలైలో ఈ ప్రక్రియ పూర్తయింది.


కాగా, హెచ్‌డీఎ్‌ఫసీ లిమిటెడ్‌ను ప్రారంభించేందుకు ఆర్థిక సాయం చేసింది ఐసీఐసీఐ లిమిటెడ్‌ కావటం గమనార్హం. దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌ మాతృసంస్థే ఐసీఐసీఐ లిమిటెడ్‌. 2002లోనే ఐసీఐసీఐ లిమిటెడ్‌ను ఐసీఐసీఐ బ్యాంక్‌లో విలీనం చేశారు.

ఇవీ చదవండి:

సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 22 , 2025 | 04:42 AM