IBM to Train 5 Million Indians: ఏఐ, క్వాంటమ్ నైపుణ్యాల్లో 50 లక్షల మందికి శిక్షణ ఐబీఏం
ABN , Publish Date - Dec 20 , 2025 | 07:03 AM
ఏఐ, క్వాంటమ్ నైపుణ్యాల్లో 50 లక్షల మందికి శిక్షణ ఐబీఏం
న్యూఢిల్లీ : అమెరికా టెక్నాలజీ దిగ్గజం ఐబీఏం.. 2030 నాటికి 50 లక్షల మంది భారతీయ యువతకు కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ‘ఐబీఏం స్కిల్స్‌బిల్డ్ ’ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ శిక్షణను అందించనుంది. కాగా ఇందుకోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)తో ఐబీఎం భాగస్వామాన్ని కుదుర్చుకుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజిటల్ నైపుణ్యాలు, ఉపాధి సామర్థ్యాలను పెంపొందించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఐబీఏం చైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణ తెలిపారు.
ఇవీ చదవండి:
రూపాయి పతనంపై దిగులొద్దు: సంజీవ్ సన్యాల్