Share News

Hyderabad Tops in GCC Leadership: అందులో.. హైదరాబాద్‌ టాప్‌..

ABN , Publish Date - Nov 06 , 2025 | 06:37 AM

దేశంలో ఏర్పాటవుతున్న గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) నాయకత్వం పూర్తిగా హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లోనే కేంద్రీకృతమయింది. జీసీసీల్లో ప్రతీ 10 నాయకత్వ స్థానాల్లోనూ 7 ఈ రెండు నగరాల్లోనే...

Hyderabad Tops in GCC Leadership: అందులో.. హైదరాబాద్‌ టాప్‌..

జీసీసీ నాయకత్వ ప్రతిభలో

న్యూఢిల్లీ: దేశంలో ఏర్పాటవుతున్న గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) నాయకత్వం పూర్తిగా హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లోనే కేంద్రీకృతమయింది. జీసీసీల్లో ప్రతీ 10 నాయకత్వ స్థానాల్లోనూ 7 ఈ రెండు నగరాల్లోనే ఉన్నట్టు క్వెస్‌ కార్పొరేషన్‌ విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది. నాయకత్వ స్థానాలకు ప్రతిభావంతులను ఎంపిక చేసుకోవడంలో హైదరాబాద్‌ 42ు వృద్ధితో అగ్రస్థానంలో ఉంది. పోటీ ప్రీమియం 6-8ు ఉంది. ప్రతిభావంతుల సంఖ్యలో బెంగళూరు టాప్‌లో ఉంది. ఇక్కడ వ్యయ సూచీ మార్కెట్‌ సగటు కన్నా 8-10ు అధికంగా ఉంది. ఫైనాన్స్‌; రిస్క్‌, అదుపు ఆధారిత పని విభాగంలో చెన్నై ప్రాధాన్యతా నగరంగా నిలిచింది. ఇక్కడ రిటెన్షన్‌ స్థాయి 94ు ఉంది. ప్రథమ శ్రేణి నగరాల్లో ఇది గరిష్ఠ స్థాయి.

నిపుణుల కొరత: టెక్నాలజీ విభాగాల్లో ప్రతిభావంతుల కొరత తీవ్రంగా ఉన్నట్టు కూడా క్వెస్‌ కార్ప్‌ తెలిపింది. ప్రధానంగా జెనరేటివ్‌ ఏఐ, ఎల్‌ఎల్‌ఎం ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఈ కొరత 50ు వరకు ఉన్నట్టు అంచనా. ఇతర విభాగాల్లో కొరత 38-45ు ఉంది. కీలకమైన నాయకత్వ బాధ్యతల్లో నియామకాలకు 90 నుంచి 120 రోజుల సమయం పడుతోంది. ఆఫర్‌ ప్రకటించిన తర్వాత జాయిన్‌ కావడానికి జరుగుతున్న వ్యత్యాసం 68-72ు ఉంది. బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో ఈ కొరత అధికంగా ఉన్నందు వల్ల ప్రాజెక్టుల అమలు నత్తనడకన సాగుతున్నట్టు క్వెస్‌ కార్ప్‌ నివేదిక వెల్లడించింది.

ఇవీ చదవండి:

Investors Wealth: రూ 2 లక్షల 71 కోట్ల సంపద నష్టం

మార్కెట్లో హ్యుండయ్‌ సరికొత్త వెన్యూ

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 06 , 2025 | 11:58 AM