Gold Price Today: వరుసగా నాలుగో రోజూ బంగారం ధర తగ్గుముఖం
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:01 PM
దేశంలో బంగారం ధర కొంచెం.. కొంచెంగా అక్కరకొస్తోంది. గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు నాలుగో రోజు కూడా తగ్గాయి. దీపావళి తర్వాత నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం..
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బంగారం ధర కొంచెం.. కొంచెంగా అక్కరకొస్తోంది. గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్నబంగారం ధరలు నేడు నాలుగో రోజు కూడా తగ్గాయి. దీపావళి తర్వాత నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు నేడు వరుసగా నవంబర్ 7వ తేదీ శుక్రవారం కూడా తగ్గాయి.
దీపావళికి 1,31,000 రూపాయలు పలికిన బంగారం ధర ఇప్పుడు, తులంపై దాదాపు 9 నుంచి 10వేలు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల (999) స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకు రూ. 12,202 వద్ద ఉంది. ఇది నిన్నటి ధర రూ.12,257 కంటే రూ.55 తగ్గింది.
అదేవిధంగా, ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.11,188 వద్ద నడుస్తోంది. నిన్నటి కంటే రూ.47 తగ్గింది. ఇక, 18 క్యారెట్ల బంగారం ధర కూడా కాస్త తగ్గి, గ్రాముకు రూ.9,152 వద్ద ఉంది. ఇది రూ.41 మేర తగ్గింది.
గమనిక: ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు GST, TCS, తయారీ ఛార్జీలు అదనంగా ఉంటాయి. కచ్చితమైన, తుది ధర, వివరాల కోసం మీ నమ్మకమైన స్థానిక ఆభరణాల దుకాణాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. బంగారం ధరలు స్థిరంగా ఉండవు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కావున కొనేటప్పుడు ధరల్లో మార్పులు సర్వసాధారణం,
ఇవి కూడా చదవండి..
లగేజీ చూసి.. అంతా లారీ అని అనుకున్నారు.. చివరకు ముందు వైపు చూసి షాక్ అయ్యారు..
రోడ్డు పక్కన పొదల్లో పడిపోయిన యువతి.. సమీపానికి వెళ్లి చూడగా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి