HP Job Cuts: హెచ్‌పీలో 2028లోగా 6000 జాబ్స్ ఔట్
ABN , Publish Date - Nov 27 , 2025 | 03:03 AM
టెక్ ఉద్యోగాల్లో కోతల పర్వం కొనసాగుతోంది. వచ్చే మూడేళ్లలో నాలుగు వేల నుంచి ఆరు వేల మంది ఉద్యోగులను తీసివేయనున్నట్టు పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) తయారీ సంస్థ హెచ్‌పీ ఇంక్ ప్రకటించింది...
న్యూయార్క్: టెక్ ఉద్యోగాల్లో కోతల పర్వం కొనసాగుతోంది. వచ్చే మూడేళ్లలో నాలుగు వేల నుంచి ఆరు వేల మంది ఉద్యోగులను తీసివేయనున్నట్టు పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) తయారీ సంస్థ హెచ్‌పీ ఇంక్ ప్రకటించింది. దీని వల్ల 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.8,900 కోట్లు) వరకు ఆదా అవుతాయని కంపెనీ సీఈఓ ఎన్‌రిక్ లోరెస్ ప్రకటించారు. ప్రొడక్ట్ డెవల్‌పమెంట్, ఇంటర్నల్ ఆపరేషన్స్, కస్టమర్ సపోర్ట్ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై ఈ కోతల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావమే ఇందుకు కారణమన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ హెచ్‌పీ కంపెనీ 1,000 నుంచి 2,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది.
ఇవీ చదవండి:
డిసెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ప్లాన్ చేస్కోండి.!
మీ చిన్నారులకు పాన్ కార్డ్ తీసుకోండి.. ఇన్వెస్ట్‌మెంట్‌పై అవగాహన కల్పించండి!