Heritage Foods Awarded Golden Peacock: హెరిటేజ్ ఫుడ్స్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డు
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:45 AM
హెరిటేజ్ ఫుడ్స్.. కార్పొరేట్ గవర్నెన్స్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) నెలకొల్పిన ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ పీకాక్ అవార్డు గెలుచుకుంది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హెరిటేజ్ ఫుడ్స్.. కార్పొరేట్ గవర్నెన్స్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) నెలకొల్పిన ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ పీకాక్ అవార్డు గెలుచుకుంది. విభిన్న రంగాల్లో కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో సాధించిన అద్భుత ఫలితాలకు గాను హెరిటేజ్ ఫుడ్స్ ఈ అవార్డును దక్కించుకోగలిగినట్టు కంపెనీ తెలిపింది. చెక్కు చెదరని సమగ్రతతో కూడిన తమ వ్యాపార నిర్వహణకు గుర్తింపు ఈ అవార్డు అని కంపెనీ వైస్ చైర్‌పర్సన్, ఎండీ నారా భువనేశ్వరి అన్నారు. లండన్‌లో నవంబరు 4వ తేదీన నిర్వహించనున్న ప్రపంచ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ సస్టెయినబులిటీ సదస్సులో ఈ అవార్డును హెరిటేజ్ ఫుడ్స్‌కు బహూకరించనున్నారు.
ఇవి కూడా చదవండి..
మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం
Read latest AP News And Telugu News