Heritage Foods Profit: హెరిటేజ్ ఫుడ్స్ లాభం రూ 51 కోట్లు
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:56 AM
హెరిటేజ్ ఫుడ్స్ వర్తమాన ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.1112.50 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.50.99 కోట్ల కన్సాలిడేటెడ్ లాభం ఆర్జించింది....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హెరిటేజ్ ఫుడ్స్ వర్తమాన ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.1112.50 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.50.99 కోట్ల కన్సాలిడేటెడ్ లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన ఆదాయం రూ.1019.52 కోట్లు కాగా లాభం రూ.48.62 కోట్లు. వార్షిక ప్రాతిపదికన లాభం 4.87ు పెరిగినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే కాలంలో వ్యయాలు రూ.957.49 కోట్ల నుంచి రూ.1059.2 కోట్లకు పెరిగినట్టు పేర్కొంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అధిక సేకరణ వ్యయాలు వంటి సవాళ్ల నేపథ్యంలో సైతం తాము 9ు ఆదాయ వృద్ధిని సాధించామని తెలియచేసింది. పాల సేకరణ 2.1ు క్షీణించి రోజుకి సగటున 16.1 లక్షల లీటర్లకు తగ్గిందని, అయితే సేకరణ వ్యయాలు మాత్రం 6.3ు పెరిగి లీటర్ రూ.42.8కి చేరాయని వివరించింది. పాల లభ్యత పెరగడంతో పాటు జీఎ్‌సటీ ప్రభావం, పండుగ సీజన్ డిమాండు, సీజనల్ రికవరీతో ద్వితీయార్ధం బలంగా ఉంటుందని భావిస్తున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telugu News