Heritage Foods Aquisition: పీనట్‌బటర్ అండ్ జెల్లీ కంపెనీలో 51శాతం వాటా
ABN , Publish Date - Oct 28 , 2025 | 02:35 AM
పీనట్‌బటర్ అండ్ జెల్లీ కంపెనీలో 51% వాటా హెరిటేజ్ ఫుడ్స్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ తన ప్రీమియం ఐస్ క్రీమ్స్, డిజర్ట్స్ శ్రేణిని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ముంబై కేంద్రంగా పనిచేసే పీనట్‌బటర్ అండ్ జెల్లీ ప్రైవేట్ లిమిటెడ్ ఈక్విటీలో 51 శాతం వాటాను రూ.9 కోట్లకు కొనుగోలు చేస్తోంది. స్కై గేట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ చేతిలో ఉన్న ఈ వాటా కొనుగోలు కోసం త్వరలోనే ఒప్పందం చేసుకోబోతున్నట్టు హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. మిగిలిన 49 శాతం వాటా పీనట్‌బటర్ అండ్ జెల్లీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ల చేతిలోనే ఉంటుంది.
అయితే వచ్చే ఏడాది మార్చి తర్వాత ఈ కంపెనీ ఈక్విటీలో మరో 20 శాతం వాటాను అప్పటి ధర ప్రకారం కొనుగోలు చేసే అవకాశం ఉంచుకున్నట్టు హెరిటేజ్ ఫుడ్స్ పేర్కొంది. పీనట్‌బటర్ అండ్ జెల్లీ ఆరోగ్యానికి హాని చేయని హై ప్రొటీన్‌తో కూడిన ఐస్ క్రీములు, డిజర్ట్‌ల తయారీలో మంచి పేరుంది. పంచ దార లేకుండా సంప్రదాయ తీపి పదార్ధాలతో విరిగిన పాల నుంచి తీసే ప్రొటీన్‌తో తయారు చేసే ఈ ఉత్పత్తులను పీనట్‌బటర్.. ‘గెట్ ఏ వే’ బ్రాండ్ పేరుతో విక్రయిస్తోంది.
ఇవీ చదవండి:
నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి