Share News

ఫార్మాపై జీఎ్‌సటీని హేతుబద్దీకరించాలి

ABN , Publish Date - Aug 27 , 2025 | 05:36 AM

ప్రతిపాదిత జీఎ్‌సటీ సంస్కరణలు ఫార్మా పరిశ్రమకు తోడ్పడేలా ఉండాలని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంస్కరణలు హేతుబద్ధంగా, ఫార్మా కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను...

ఫార్మాపై జీఎ్‌సటీని హేతుబద్దీకరించాలి

కీలక అంశాలనూ పరిష్కరించాలి

డాక్టర్‌ రెడ్డీస్‌ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి

నూఢిల్లీ: ప్రతిపాదిత జీఎ్‌సటీ సంస్కరణలు ఫార్మా పరిశ్రమకు తోడ్పడేలా ఉండాలని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంస్కరణలు హేతుబద్ధంగా, ఫార్మా కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేలా ఉండాలన్నారు. చాలా కాలంగా ఫార్మా కంపెనీలు ఔషధాలపై తక్కువ పన్ను, ముడి పదార్ధాలపై ఎక్కువ పన్నుల సమస్యను ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తు చేశారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి, రోగులకూ ఔషధాలు అందుబాటు ధరల్లో లేకుండా పోతున్నాయన్నారు. త్వరలో చేపట్టే సంస్కరణలు ఈ కీలక సవాళ్లను అధిగమించేలా ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. పన్నుల హేతుబద్దీకరణ ద్వారా ప్రతి పౌరుడికి అత్యవసర మందుల ధర అందుబాటులో ఉండే అవకాశం ఏర్పడుతుందన్నారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లోనూ మన కంపెనీల పోటీ సామర్ధ్యం పెరిగి సరికొత్త ఔషధాలనూ ఉత్పత్తి చేయగలుగుతామని సతీష్‌ రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమకు మేలు చేసే సంస్కరణల కోసం ప్రభుత్వంతో కలిపి పని చేసేందుకూ సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం తుది ఔషధాలపై 12 శాతం, వాటి తయారీ కోసం వినియోగించే ముడి పదార్ధాలపై 18 శాతం జీఎ్‌సటీ అమల్లో ఉంది. సంస్కరణల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న నాలుగు జీఎ్‌సటీ శ్లాబులను ప్రభుత్వం 5, 18 పేరుతో రెండు శ్లాబులుగా మార్చాలని యోచిస్తోంది.

దేశీ మార్కెట్లోకి లినాక్లోటైడ్‌ ఔషధం

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ దేశీయ మార్కెట్లోకి జెనరిక్‌ మలబద్దకాన్ని తగ్గించే ఔషధం లినాక్లోటైడ్‌ను తీసుకువచ్చింది. కొలోజో బ్రాండ్‌ పేరుతో దీన్ని విక్రయించనుంది. ఈ ఔషధం పెద్దలు, 6 నుంచి 17 ఏళ్ల వయసు కలిగిన వారిలో తలెత్తే మలబద్దకాన్ని నివారిస్తుందని తెలిపింది.

ఇవీ చదవండి:

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ మెగా డీల్‌

ఫ్లిప్‌కార్ట్‌లో 2.2 లక్షల సీజనల్‌ ఉద్యోగాలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 27 , 2025 | 05:36 AM